నేడు ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర
సీతంపేట: ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర సోమవారం జరగనుందని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బిడ్డిక శ్రీనివాసరావు తెలిపారు. మల్లిలో ఆదివారం జరిగిన యాక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యాత్ర కుశిమి జంక్షన్ వద్ద ప్రారంభమై వయా మల్లి, కుశిమి, శంబాం, కిట్టాలపాడు, సీతంపేట, దేవనాపురం, మొగదార దోనుబాయి మీదుగా యాత్ర కొనసాగుతుందన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు బి.ఉమామహేశ్వరరావు, కె.భాస్కరరావు, రామ్మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


