పోలమాంబ మారుజాతరకు పూర్తికావచ్చిన ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పోలమాంబ మారుజాతరకు పూర్తికావచ్చిన ఏర్పాట్లు

Feb 3 2026 7:47 AM | Updated on Feb 3 2026 7:47 AM

పోలమా

పోలమాంబ మారుజాతరకు పూర్తికావచ్చిన ఏర్పాట్లు

15వేలు లడ్డూ ప్రసాదం తయారీ

30మంది దేవాదాయసిబ్బంది

170మందితో పోలీస్‌ బందోబస్తు

మక్కువ: ఉత్తరాంఽధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మారుజాతర నేడు జరగనుంది. జాతరకొచ్చే భక్తుల సౌకర్యార్థం ఈవో బి.శ్రీనివాస్‌, ట్రస్ట్‌బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. జాతరలో భక్తుల అవసరార్థం 15వేల లడ్డూప్రసాదాన్ని దేవాదాయశాఖ తయారుచేయించింది. అవసరమైన మేరకు పులిహోర భక్తులకు అందించనున్నట్లు ఈవో తెలిపారు. జాతరకొచ్చే భక్తులకు సేవలందించేందుకు 30మంది దేవాదాయశాఖ సిబ్బంది శంబర గ్రామానికి చేరుకున్నారు.

హెల్మెట్‌ ధరించి జాతరకు రావాలి

ద్విచక్రవాహనాలపై జాతరకు చేరుకునే భక్తులు తప్పక హెల్మెట్‌ ధరించాలని సీఐ రామకృష్ణ భక్తులకు విజ్ఞప్తి చేశారు. జాతరలో 170మంది పోలీస్‌బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యంతాగి ఆలయానికి రావద్దన్నారు. ఎటువంటి గొడవలకు తావివ్వకుండా, ఆధ్యాత్మిక భావనతో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని దర్శించుకోవాలని సూచించారు.

పోలమాంబ మారుజాతరకు పూర్తికావచ్చిన ఏర్పాట్లు1
1/1

పోలమాంబ మారుజాతరకు పూర్తికావచ్చిన ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement