విజయనగరం క్రైమ్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శుక్రవారం బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. వన్‌టౌన్ ఎస్‌ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం మండలం రాకోడుకు చెందిన బోదంకి నారాయణమ్మ(76) బస్సు కోసం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చింది. ఆ సమయంలో బస్టాండ్‌లో డ్రైవర్ లక్ష్మునాయుడు బస్సు తీసే క్రమంలో వెనుకాలే ఉన్న నారాయణమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె పడిపోయింది. ఆమె పైనుంచి బస్సు వెళ్లిపోయింది. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమీపంలో ట్రాఫిక్ అవుట్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెచ్.పాల్ ప్రమాద సమాచారాన్ని మ్యాన్ ప్యాక్ ద్వారా వన్‌టౌన్ పోలీసులకు ఇచ్చాడు. వన్ టౌన్ ఎస్‌ఐ రవి ప్రమాద స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి మనవడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.


