గిరిజన సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

గిరిజన సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత

May 9 2026 7:56 AM | Updated on May 9 2026 7:56 AM

పార్వతీపురం: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఐటీడీఏ పీఓ ఆర్‌.వైశాలి అన్నారు. శుక్రవారం ఐటీడీఏలోని గిరిమిత్ర హాల్‌లో నిర్వహించిన గిరిజన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 19 వినతులను స్వీకరించి, సంబంధిత శాఖాధికారులతో వెంటనే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ వినతిని బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సేవలు సమయానికి అందేలా చర్యలు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఓ పి.మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement