బడి బస్సులకు భద్రతా పరీక్ష | - | Sakshi
Sakshi News home page

బడి బస్సులకు భద్రతా పరీక్ష

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

బడి బస్సులకు భద్రతా పరీక్ష ● మన్యంలో తనిఖీలు ముమ్మరం! ● 63 వాహనాల పరిశీలన పూర్తి.. ● మరమ్మతుల్లో మరో 32 : డీటీఓ

● మన్యంలో తనిఖీలు ముమ్మరం! ● 63 వాహనాల పరిశీలన పూర్తి.. ● మరమ్మతుల్లో మరో 32 : డీటీఓ

పార్వతీపురం రూరల్‌ : విద్యార్థుల సురక్షిత ప్రయా ణమే సంకల్పంగా పార్వతీపురం మన్యం జిల్లాలో బడి బస్సుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నా యి. పారదర్శక సేవలే లక్ష్యంగా జిల్లా రవాణా అధి కారి (డీటీఓ) దుర్గాప్రసాద్‌ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 95 పాఠశాల బస్సులకుగాను, ఇప్పటివరకు 63 వాహనాల పరిశీలన పూర్తయింది. ఈ తనిఖీల్లో బస్సుల సాంకేతిక స్థితిగతులు, భద్ర తా ప్రమాణాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాల ఫిట్‌నెస్‌ నిర్ధారించడమే ఈ డ్రైవ్‌ ముఖ్య ఉద్దేశమని డీటీఓ స్పష్టం చేశారు. ప్రస్తుతం వివిధ మరమ్మతు ల్లో ఉన్న మిగిలిన 32 బస్సులను కూడా బాగు చేయించిన అనంతరం.. నిర్ణీత గడువులోగా తనిఖీ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను డీటీఓ ఆదేశించారు. ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరవేయడంలో మీడియా అందిస్తున్న సహకారం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement