క్రీడల్లో సత్తాచాటిన రేగిడి విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో సత్తాచాటిన రేగిడి విద్యార్థులు

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

క్రీడల్లో సత్తాచాటిన రేగిడి విద్యార్థులు

రేగిడి: మండల పరిధిలోని పనసలవలస గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి గోల్డ్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారని పాఠశాల పీడీ కోటిచక్రధరరావు ఆదివారం విలేకరులకు తెలిపారు. విజయవాడలో జరిగిన అండర్‌–17 కేటగిరీలో గుండాల సాగర్‌, అండర్‌ –19 విభాగంలో కడగల కార్తీక్‌ ట్రైఅథ్లాన్‌ విభాగంలో షూటింగ్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్‌ కాంబినేషన్‌లో పాల్గొన్నారని తెలిపారు. కార్తీక్‌ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్‌ సాధించగా సాగర్‌ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడని తెలిపారు. వారు మోడ్రన్‌ పెంటాథ్లాన్‌ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ చప్పిడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మెడల్స్‌ అందుకున్నారని పీడీ వెల్లడించారు. విద్యార్థుల ప్రతిభపట్ల ఎంఈఓలు ఎంవీ ప్రసాదరావు, బి.ఎరకయ్య, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement