తాగునీరు లేక అల్లాడిపోతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

తాగునీరు లేక అల్లాడిపోతున్నాం..

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

తాగునీరు లేక అల్లాడిపోతున్నాం..

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ఎల్‌.కోట మేజర్‌ పంచాయతీ ప్రజలు

లక్కవరపుకోట: లక్కవరపుకోట మేజర్‌ పంచాయతీ ప్రజలు ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంటిని శనివారం తెల్లవారుజామున ముట్టడించారు. కొద్ది రోజులుగా తాగునీరు లేక అల్లాడిపోతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారులకు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ.. గ్రామంలో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో మహిళలు వెనుదిరిగారు. కొద్దిసేపటి తర్వాత జామివీధి, సంఘం వీధిలో ఎమ్మెల్యే పర్యటించి మహిళలతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. వెంటనే అర్‌డబ్ల్యూఎస్‌ డీఈ పైడిరాజు, ఎంపీడీఓ అల్లు భాస్కరరావుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement