వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి బాబూ..! | - | Sakshi
Sakshi News home page

వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి బాబూ..!

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి బాబూ..!

అధికారం చేపట్టిన రెండేళ్ల నుంచి సంక్షేమ పథకాల అమలు మానేసి ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనండంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రజలు నవ్వుకుంటున్నారనే ఆలోచన కూడా లేకుండా నోటికి ఏదివస్తే అది మాట్లాడుతున్నారు.ఆడ బిడ్డలు ఎంత మంది ఉంటే అన్ని రూ.1500 వందలు చొప్పున ప్రతి నెలా ఇస్తామని చెప్పి మోసగించిన విషయాన్ని ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ముగ్గురు, నలుగురు బిడ్డలను కంటే రూ.30 వేలు,రూ.40 వేలు అంటూ వింత పోకడకు తెరతీశారు. ఈ ప్రభుత్వం హయాంలో ఒకరు లేదా ఇద్దరు పిల్లలను పెంచడమే తల్లిదండ్రులకు కష్టంగా మారింది. ఇప్పటికై నా చంద్రబాబు వాస్తవాలను మాట్లాడడం నేర్చుకోవాలి.

పాలవలస గౌరీపార్వతి, జెడ్పీటీసీ, పాలకొండ

Advertisement
 
Advertisement
Advertisement