జీవిత నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

జీవిత నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దాలి

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

పార్వతీపురం: విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు జీవితానికి ఉపయోగపడే నైపుణ్యాలను కూడా నేర్పించాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి మండల విద్యాశాఖాధికారులకు సూచించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో ఆయన గురువారం సమీక్షించారు. పాఠశాలలను స్నేహపూర్వక వాతావరణంగా తీర్చిదిద్దుతూ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈత, సైకిల్‌ తొక్కడం, వంట చేయడం వంటి ప్రాథమిక జీవన నైపుణ్యాలతోపాటు స్కిిప్పింగ్‌, సూర్య నమస్కారాలు వంటి శారీరక వ్యాయామాలను ప్రోత్సహించాలని తెలిపారు. ముస్తాబు కార్యక్రమంలో పరిశుభ్రత, క్రమ శిక్షణ, ఆరోగ్య అలవాట్లపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలని సూచించారు. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణపై చిన్న వయస్సులోనే శాసీ్త్రయ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి పైలెట్‌ ప్రాజెక్టు రూపంలో కార్యక్రమాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఈఓ పి.బ్రహ్మాజీరావు, ఎంఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో అమలవుతున్న ముస్తాబు కార్యక్రమానికి కలెక్టర్‌ మెంటార్‌గా ఎంపిక కావడంపై విద్యాశాఖ అధికారులు కలెక్టర్‌ను దుశ్శాలువతో సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement