తెర్లాం:
ఆంధ్రా యూనివర్జిటీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్(ఏయూఈఈటీ)–2026 ఫలితాల్లో తెర్లాం పంచాయతీ పరిధిలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన గొల్లు జయరాం ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇంటర్మీడియట్ తరువాత బీటెక్‌లో జాయిన్ అయ్యేందుకు ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో జయరాం 84 మార్కులు సాధించి ఏయూ పరిధిలో ఫస్ట్ ర్యాంక్‌ను కై వసం చేసుకున్నాడు. తెర్లాం మండలంలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన గొల్లు జయరాం 1–5 తరగతులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోను, 6–10 తరగతులు బొబ్బిలి అభ్యుదయ స్కూల్‌లోను, ఇంటర్మీడియట్ విశాఖపట్నం కేఎంఆర్ జూనియర్ కాలేజ్‌లో చదువుకున్నాడు. చిన్నయ్యపేట గ్రామానికి చెందిన గొల్లు సత్యనారాయణ, నరసనీలిమల చిన్న కుమారుడు జయరాం. తండ్రి వ్యవసాయదారు కాగా తల్లి గృహణి. కుమారుడికి ఫస్ట్ ర్యాంక్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


