దూసుకొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

May 9 2026 7:56 AM | Updated on May 9 2026 7:56 AM

దూసుకొచ్చిన మృత్యువు ● కొమరాడలో కనురెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం ● అదుపు తప్పి కూరగాయల దుకాణంలోని దూసుకెళ్లిన బొలేరో ● ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

● కొమరాడలో కనురెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం ● అదుపు తప్పి కూరగాయల దుకాణంలోని దూసుకెళ్లిన బొలేరో ● ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

కొమరాడ: రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణంలో టీ తాగుతూ ముచ్చట్లు చెబుతున్న ఓ వృద్ధుడిపై మృత్యువు దూసుకొచ్చింది. బొలేరో వాహనం రూపంలో కనురెప్పవేసిన పాటులో ప్రాణాలను హరించింది. వ్యవసాయ పనులపై వెళ్తూ ఆగిన మరో ఇద్దరు.. కూరగాయలు విక్రయిస్తున్న మరో మహిళను క్షతగాత్రులుగా మార్చింది. దుకాణాలపైకి దూసుకొచ్చిన బొలేరోవాహనాన్ని చూసిన స్థానికులు భీతిల్లిపోయారు. భయంతో పరుగులు తీశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం నుంచి రాయగడ వైపు అతివేగంగా వెళ్తున్న బొలేరో వాహనం శుక్రవారం మధ్యాహ్నం అదుపుతప్పి కొమరాడ మండల కేంద్రంలోని రోడ్డుపక్కన ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టీ తాగేందుకు వచ్చిన కొమరాడ గ్రామానికి చెందిన మరడాన చిన్నంనాయుడు(75) దుర్మరణం చెందారు. పొరుగు జిల్లా నుంచి వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ముద్దురు గోపాల్‌కృష్ణ, కూనేరు రామభభద్రపురం గ్రామానికి చెందిన మోయి జాషువ, అక్కడే కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న బొత్స మహలక్ష్మి గాయపడ్డారు. వీరిని వైద్యం కోసం కొమరాడ పీహెచ్‌సీకి తరలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కొమరాడ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement