సాలూరు: విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం వల్లనే గిరిజన యువకుడు మృతి చెందాడని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు ఆరోపించారు. మక్కువ మండలం ఎర్రసామంతవలసలో విద్యుత్‌లైన్లు తగిలి విద్యుత్‌శాఖలో అవుట్‌సోర్సింగ్‌గా పనిచేస్తున్న పీడిక ప్రకాష్ అలియాస్ నవీన్(23) మృతిచెందాడని తెలిసి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని సీపీఎం బృందం పరామర్శించింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సదరు యువకుడి మృతికి విద్యుత్ శాఖ అధికారులు అధికారులు బాధ్యులని కావున విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడైన ప్రకాష్‌పై ఆధారపడి ఆయన తండ్రి చిన్నప్ప, తల్లి సంబరమ్మ, అక్క, తమ్ముడు చిన్నారి,గణేష్‌లు జీవిస్తున్నారని అన్నారు. విద్యుత్ పనుల నిమిత్తం వెళ్లిన ప్రకాష్ విగతజీవిగా మారాడని, కావున ఆ కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎన్‌వైనాయుడు, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు.


