పార్వతీపురం: జనగణనలో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. సోమవారం జనాభా గణన అవగాహన ప్రచార రథాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ 15శాతం పూర్తయి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నా రు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజలు నాటు వైద్యానికి దూరంగా ఉండి ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, వివిధ శాఖల అధికా రులు పాల్గొన్నారు.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ పురోగతి
గర్వకారణం
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన విజ యాలు ఎంతో గర్వకారణమని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998 మే 11న జరిగిన పో ఖ్రాన్–2 అణుపరీక్షల విజయాన్ని స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచుకుని నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌ఓ కె.హేమలత, ఎస్‌డీసీ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


