విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని ఆయన నివాసంలో మజ్జి శ్రీనివాసరావు కలిసి సాదర స్వాగతం పలికారు. ఈ భేటీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు.


