భోజనానికి టెండర్‌..! | - | Sakshi
Sakshi News home page

భోజనానికి టెండర్‌..!

May 8 2026 1:25 PM | Updated on May 8 2026 1:25 PM

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు భోజనం సరఫరా చేసేందు కు రెండు నెలలు కిందట నోటిఫికేషన్‌ ఇచ్చినా కొన్ని ఆస్పత్రులకు ఇప్పటివరకు టెండర్లు ఖరారు కాని పరిస్థితి. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని, టీడీపీ సర్కారు హయాంలో టెండర్ల ఖారా రులో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవారికి కట్టబెట్టి, భోజనంలో ‘టెండర్‌’పెట్టేందుకే జాప్యం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా నిర్వహించాల్సిన టెండర్ల పక్రియ గందరగోళానికి దారితీయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదీ పరిస్థితి...

ఈ ఏడాది మార్చి నెలలో జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్యవిధాన్‌ పరిషత్‌లోని ఎస్‌.కోట, గజపతినగరం, రాజాం ఏరియా ఆస్పత్రులు, నెల్లిమర్ల సీహెచ్‌సీ, బొబ్బిలి, బాడంగి, భోగాపురం, చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో డైట్‌ (భోజనం) అందించేందుకు టెండర్ల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చా రు. పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. గత నెల 13వ తేదీన జేసీ సమక్షంలో టెండర్లు తెరిచా రు. బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, చీపురుపల్లి ఆస్పత్రులకు టెండర్లు ఖరారయ్యాయి. నెల్లిమర్ల సీహెచ్‌సీకి ఒక్కరు కూడా టెండర్‌ వేయలేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్య విధాన్‌ పరిషత్‌ ఆస్పత్రులై న ఎస్‌.కోట, గజపతినగరం, రాజాం ఏరియా ఆస్ప త్రుల్లో రోగులకు భోజనం సరఫరా చేసేందుకు తక్కువ ధరకు కోడ్‌ చేసిన వ్యక్తులకు అధికారులు డైట్‌ కాంట్రాక్ట్‌ను కేటాయించారు. దీనిపై టెండర్‌ లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. రోగులకు డైట్‌ సరఫరాలో అనుభవం ఉన్నట్టు టెండర్‌ ఖరారు అయిన వ్యక్తులు సమర్పించినవి తప్పుడు ధ్రువపత్రాలని ఆరోపించారు. వాస్తవికతను నిర్ధారించాలని కోరారు. దీంతో టెండ ర్‌ ఖరారైన వారు సమర్పించిన ధ్రువపత్రాల వాస్త వికత నిర్ధారణ కోసం ఏ ఆస్పత్రిలో అయితే వారు డైట్‌ సరఫరా చేసినట్టు తెలిపారో ఆ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ ఇది కొలిక్కిరాకపోవడంతో టెంటర్‌ ప్రక్రియ అసంపూర్తిగా మారింది.

ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే రోగులకు

భోజనం వడ్డింపుకోసం నిర్వహించిన టెండర్‌ ప్రక్రియ గందరగోళంగా మారింది. గడువు

ముగిసి నెలలు గడుస్తున్నా టెండర్లు ఖరారు కాలేదు. తప్పుడు ధ్రువపత్రాలతో భోజనానికి ‘టెండర్‌’పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదుపై నిజనిర్ధారణ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వాస్తవికత నిర్ధారణలో జాప్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజనిర్ధారణ జరుగుతోంది..

సర్వజన ఆస్పత్రి, గజపతినగరం, ఎస్‌.కోట, రాజాం ఏరియా ఆస్పత్రులకు సంబంధించి డైట్‌ టెండర్లు తక్కువ ధరకు టెండర్‌ వేసిన వ్యక్తులపై ఫిర్యాదులు వచ్చాయి. తప్పుడు ధ్రువపత్రాలతో వారు టెండర్‌ వేశారని ఫిర్యా దులు అందాయి. నిజనిర్ధారణ కోసం సంబంధిత ఆస్పత్రులకు పంపించాం. అక్కడ నుంచి క్లారిటీ వచ్చిన వెంటనే టెండర్లు ఖరారు చేస్తాం. అప్పటివరకు పాతకాంట్రాక్టరే భోజనం సరఫరా చేస్తారు. – డాక్టర్‌ పద్మజ,

సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

– డాక్టర్‌ పద్మశ్రీ రాణి, డీసీహెచ్‌ఎస్‌

పెద్దాస్పత్రులే టార్గెట్‌...

టెండర్లు ఖరారు కాని నాలుగు ఆస్పత్రులు కూడ పెద్దాస్పత్రులే. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సగటున రోజుకి 400 నుంచి 500 మంది వరకు రోగులు చికిత్స పొందుతారు. ఎస్‌.కోట ఏరియా ఆస్పత్రిలో 100 మంది, గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో 90 నుంచి 100 మంది, రాజాం ఏరి యా ఆస్పత్రిలో 100 మంది వరకు రోగులు ఇన్‌పేషేంట్లుగా చికిత్స పొందుతారు. డైట్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న వ్యక్తి ప్రతిరోజు మూడు పూటలా రోగులకు భోజనం అందించాలి. పెద్దాస్పత్రుల్లో భోజనం సరఫరా టెండర్‌ ప్రక్రియ గందరగోళంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.

భోజనం సరఫరా చేయాలంటే...

ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు భోజనం సరఫరా చేసేందుకు టెండర్‌ వేసేవారు ఇదివరకే ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రికి డైట్‌ సరఫరా చేసి ఉండాలి.

ఆదాయపన్ను వివరాలు సమర్పించాలి.

ఏ ఆస్పత్రిలో అయితే వారు డైట్‌ సమర్పించారో సంబంధిత ఆస్పత్రి వారి నుంచి అనుభవ ధ్రువపత్రం సమర్పించాలి.

టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి రెండు

నెలలైనా ఖరారుకాని టెండర్లు

టెండర్లు దక్కించుకున్న వారు తప్పుడు ధ్రువపత్రాలు పెట్టారని ఫిర్యాదు

పూర్తికాని నిజనిర్ధారణ

పాతకాంట్రాక్టర్‌తోనే భోజనం వడ్డింపు

Advertisement
 
Advertisement
Advertisement