అప్పటికే ఆ స్థలంపై కన్నేసిన నియోజకవర్గ ముఖ్య నేత డబుల్ గేమ్ మొదలు పెట్టారు. కార్యాలయ నిర్మాణం కోసమని ఓ వైపు హడావుడి చేస్తూనే.. తెర వెనుక వెన్నుపోటు సిద్ధం చేశారు. కొంతమందిని రెచ్చగొట్టి, కథ నడిపించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు తేజోవతిని కార్నర్ చేశారు. ఇందుకోసం ఆమె అంటే పొసగని మరో ముఖ్య నేత సహకారం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చసాగుతోంది. ఈ నెల ఏడో తేదీన స్థానికులు న్యాయస్థానం నుంచి స్టేటస్ కో ఉత్తర్వులు తెప్పించుకున్నారు. 1.61 సెంట్లు భూమిని దాదాపు 70 సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్నామని తాడ్డి మహాలక్ష్మి, రెడ్డి సీత చెబుతున్నారు. ఆ స్థలంలో హెచ్చరిక బోర్డు పాతారు. దీని అంతటి వెనుక ఆ ముఖ్యనేత ఉన్నారని తేజోవతి వర్గం బహి రంగంగానే చెబుతుండడం గమనార్హం. ఇదే విషయా న్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీని ఇరకాటంలోకి లాగడం ఎంతవరకు సమంజసమని వాదిస్తున్నారు. డబుల్ గేమ్ ఆడుతున్న ముఖ్యనే త.. తప్పంతా అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.


