హనుమాన్‌ జయంత్యుత్సవం రేపు | - | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ జయంత్యుత్సవం రేపు

May 11 2026 8:50 AM | Updated on May 11 2026 8:50 AM

హనుమాన్‌ జయంత్యుత్సవం రేపు

విజయనగరం రూరల్‌: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 12న హనుమాన్‌ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు ఎన్సీఎస్‌ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్‌ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రామనారాయణ ప్రాంగణంలో హనుమాన్‌ జయంత్యుత్సవాల ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్నపనం నిర్వహించనున్నట్టు తెలిపారు. 8 గంటలకు లక్ష తమలపాకులు, సింధూరంతో సహస్ర నామార్చనలు, హనుమాన్‌ చాలీసా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు 60 అడుగుల అభయాంజనేయ స్వామికి మహా హారతి, లేజర్‌ షో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement