నిడగల్లు సా మిల్లు వద్ద అడారు ఎంపీపీ పాఠశాలలో నరికిన టేకుచెట్లు (ఫైల్)
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మండలం అడారు ఎంపీపీ పాఠశాలలో రూ.లక్షల విలువైన టేకు చెట్లను ‘తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు’ అక్రమంగా తరలించుకుపోయిన విషయం విదితమే. అధికార పార్టీ కీలక నేతల ప్రమేయం ఉండడంతో వాస్తవానికి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నమే జరిగింది. దీనిపై పత్రికల్లో కథనాలు రావడం.. అటవీ శాఖ, విద్యాశాఖ తప్పిదాలు ఉండడంతో ఉప ముఖ్యమంత్రి పేషీ నుంచి ఆరా తీసినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే జిల్లా అటవీ శాఖ అధికారులు ఆలస్యంగా స్పందించారు. సీతానగరం మండలం నిడగల్లు వద్ద సా మిల్లులో ఉన్న టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నా రు. మిల్లు సీజ్‌తో సరిపెట్టుకున్నారు. మరోవైపు కలప అక్రమ తరలింపులో అసలు నిందితులను ఇప్పటి వరకూ గుర్తించలేదు. పాఠశాల హెచ్‌ఎం స్వ యంగా ఫిర్యాదు చేసి నా పోలీసుల నుంచి కూడా స్పందన లే దు. కేసును నీరుగార్చే క్రమంలో ఆ దుంగ లు.. పాఠశాలలో తొలగించిన చెట్లు ఒక్కటి కాదనే విషయాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నార ని తెలుస్తోంది. ఇదే సమయంలో ‘అన్న’కు తెలియకుండానే
‘తమ్ముళ్లు’ అత్యుత్సాహంతో తెలియక తప్పు చేశారన్న కొత్త వాదనను వినిపిస్తున్నారు. ఏళ్ల కిందటనాటి చెట్లు కావడంతో నామమాత్రపు రుసుంతో ఎంఈవోకు దరఖాస్తు చేసుకుంటే.. అక్కడ పరిస్థితిని బట్టి అట వీ శాఖ అనుమతితో వారే తొలగింపునకు అనుమ తి ఇచ్చేవారని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. తమను ఎవరు ఆపేదన్న అతితో ‘తమ్ముళ్లు’ దర్జాగా చెట్లను నరికి తీసుకుపోయారు. చివరికి అది వివాదం కావడంతో బురద అంటకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడుగుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను పక్కన పెట్టి.. సంబంధం లేని పాత్రధారులను బలి పశువులు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది.


