పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

May 8 2026 1:25 PM | Updated on May 8 2026 1:25 PM

పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు గురువారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లా లో తీసుకుంటున్న చర్యలను వివరించామన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగంలో 7.42 శాతం వృద్ధిరే టు సాధించామని, ఏడు కొత్త జలపాతాలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశామన్నారు. పది సూత్రాల అజెండాను అమలు చేయాలని, పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలని సీఎం సూచించారన్నారు.

రాయితీపై వ్యవసాయ పరికరాలు

జిల్లాకు 2025–26 సంవత్సరానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం (ఎస్‌ఎంఏమ్‌) కింద రూ. 2.58 కోట్ల నిధులు కేటాయించినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. ట్రాక్టర్లు, పవర్‌టిల్ల ర్లు, రోటా వీటర్లు, స్ప్రేయర్లు, రీపర్లు, వీడర్లు, పంటకోత అనంతర ప్రొసెసింగ్‌ యంత్రాలు, విత్తనా లు చల్లే, నాటే యంత్రాలు తదితర పరికరాలు 40 శాతం నుండి 50 శాతం వరకు సబ్సిడీపై మంజూ రు చేస్తామన్నారు. భూమి కలిగిన రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులు, గత మూడేళ్లలో కనీసం మూడు పంట సీజన్లలో ఈ–పంటలో నమోదు చేసుకున్న సీసీఆర్‌సీ రైతులు అర్హులన్నారు. 2024–25లో సబ్సిడీ పొందిన వారు ఈ సారి అర్హులు కారని తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 19వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. ఎంపికై న రైతులు 15 రోజుల్లో తమ వాటాను యూపీఐ లేదా నెట్‌ బ్యాంకింగ్‌ విధానంలో చెల్లించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement