సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వానికి పాదర్శకత అవసరం. జిల్లాలో అనేక మంది తల్లికి వందనం పథకం లబ్ధి కోల్పోయారు. గత వైఎస్.జగన్ హయాంలో లబ్ధి పొందినవారు గత ఏడాది అర్హత పొందలేకపోయారు. యూడైస్‌లో తప్పుడు సమాచారం ఆన్‌లైన్ ద్వారా నమోదైనట్లు చెప్పిన యంత్రాగం వాటిని సరిచేసుకున్నా నగదు జమ చేయలేదు. గతంలో ముఖ్యంగా పాలకొండ పట్టణంతోపాటు నియోజకవర్గంలో అనేకులు అర్హత కోల్పోయారు. పాదర్శకంగా వివరాలు నమోదు చేయడంతో పాటు గతంలో ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నవారికి ఈ ఏడాది రూ.30వేలు జమ చేయాలి.
విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ


