చీపురుపల్లి: స్థానిక శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గురువారం హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవదాయ ధర్మాదాయశాఖ అధికారి జి.శ్యామ్‌ప్రసాద్, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎస్.నానాజీబాబు సమక్షంలో ఉదయం 10 గంటలకు ఆలయ హుండీలను తెరిచి లెక్కించారు. ఫిబ్రవరి 25, 2026 నుంచి మే 14, 2026 వరకు హుండీల ద్వారా మొత్తం రూ.3,70,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, ప్రతినిధులు పొట్నూరు త్రినాథరావు, లెంక చిన్నారావు, అడ్డూరి భారతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


