గజపతినగరం రూరల్: మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు శుక్రవారం అందించిన వివరాలు... పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు(25) ఈ నెల ఆరో తేదీ రాత్రి 8.40 గంటల సమయంలో రైల్వే టికెట్ తీసుకొని భవానిపట్నం పాసింజర్‌లో సింహాచలం నుంచి పార్వతీపురం ప్రయాణం చేస్తుండగా గజపతినగరం – కోమటిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. దీంతో అప్పలనాయుడు తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బొబ్బిలి జీఆర్‌పీ హెచ్‌సీ బండారు ఈశ్వరరావు తెలిపారు.


