కుక్కల దాడిలో గొర్రె, మేక పిల్లల మృతి | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో గొర్రె, మేక పిల్లల మృతి

May 10 2026 8:04 AM | Updated on May 10 2026 8:04 AM

సంతకవిటి: మండలంలోని కృష్ణంవలస గ్రామంలో వంకల పాపయ్యకు చెందిన నాలుగు గొర్రె పిల్లలు, రెండు మేక పిల్లలు కుక్కల దాడిలో శనివారం మృతి చెందాయి. పాపయ్య మధ్యాహ్న సమయంలో గొర్రె, మేక పిల్లలను పాకలో పెట్టి, ఇంటికి భోజనానికి రాగా ఇంతలో కుక్కలు చొరబడి వాటిపై దాడి చేసి చంపేశాయి. దీనితో పాపయ్య బోరున విలపించారు. వీటి విలువ దాదాపు రూ.30 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, కుక్కలను గ్రామం నుంచి బయటకు పంపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల బెడదతో చిన్నారులను ఇంటి నుంచి బయటకు పంపించాలంటే భయంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.

సహస్ర నామార్చనలు

బొబ్బిలి: స్థానిక పట్టణంలోని కంచర వీధిలో కొలువైన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సహస్రనామార్చనలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement