పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ ఎయిడ్స్ స్మారక దినాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్యాలయం నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వరకు సాగిన ఈ ర్యాలీలో ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొని ఎయిడ్స్ మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జగన్ మోహన్ రావు, నేత్ర వైద్య అధికారి డాక్టర్ నగేష్ రెడ్డి, ఏపీ సాక్స్ ప్రతినిధులు లక్ష్మణ రావు, కోటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


