● రానున్న ఐదు రోజులు మండే ఎండలు ● ప్రజలకు కలెక్టర్ హెచ్చరిక
పార్వతీపురం: మన్యం జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శు క్రవారం తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) విభాగం విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం జిల్లాలోని 15 మండలాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం, గరుగు బిల్లి, పాలకొండ, బలిజిపేట, వీరఘట్టం, కొమరా డ, జియ్యమ్మవలస. పాచిపెంట, భామిని, సీతంపేట, సీతానగరం, సాలూరు తదితర మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మండలాల్లో ఉష్ణోగ్రత లు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 54 డిగ్రీల వరకు నమోదయ్యే అవ కాశం వుందని పేర్కొ న్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా తరు చూ తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ నివారణకు గొడుగు లేదా టోపీ వినియోగించాలని సూచించారు.


