అధికారులపై ఎమ్మెల్యే చిందులు | - | Sakshi
Sakshi News home page

అధికారులపై ఎమ్మెల్యే చిందులు

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

అధికారులపై ఎమ్మెల్యే చిందులు

ఎమ్మెల్యే తీరుపై సీపీఎం ధ్వజం

కామన్‌ సెన్స్‌ లేదా? అంటూ తీవ్ర పదజాలం విస్తుపోతున్న ఉద్యోగవర్గాలు తమ అక్రమాలకు అధికారులు సాయపడడం లేదన్న అక్కసుతో నిప్పులు చెరుగుతున్నారన్న సందేహాలు

సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్‌ చంద్ర మరోసారి అధికారులపై అక్కసు వెళ్లగక్కారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రెండు రోజుల కిందట ‘గాడిదలు కాస్తున్నారా?’ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించిన ఆయన.. సోమవారం కామన్‌ సెన్స్‌ లేదా? అంటూ వ్యాఖ్యలు చేయడం మరింత వివాదం అయ్యింది. అధికారులతో జిల్లాలో ఎవరికీ లేని సమస్య ఆయనకే ఎందుకు వస్తుంది? కలెక్టర్‌, రెవెన్యూ యంత్రాంగం మీద వరుసగా మాటల దాడి వెనుక మర్మమేమిటి? ఇప్పుడు ఇవే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

వాస్తవాలను దాచేసి..

వాస్తవానికి జిల్లా టీడీపీ కార్యాలయం స్థల వివా దం మొత్తం ఎమ్మెల్యేకు తెలుసు. అన్నీ తెలిసి కూడా కేబినెట్‌ భేటీలో అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయలేదన్నది ప్రశ్న. 2002 నాటి వివాదాన్ని ఇప్పుడు తెర మీదకు తేవడం వెనుక బలమైన కారణం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొద్ది రోజులుగా ఈ అంశం నలుగుతున్నా బాధితుల తరఫున ఎవరూ సబ్‌ కలెక్టర్‌ వద్ద అప్పీలు చేయలేదు. ఈ స్థలం విషయంలో అధికారిక ఉత్తర్వులు కూడా ఎక్కడా ఇవ్వలేదు. ముందుగా ఆపే ప్రయత్నం చేయకుండా.. చివరి నిమిషంలో అధికారుల మీద నెపం నెట్టడం వెనుక మరో కారణం ఉండొచ్చని అధికారులు అంటున్నారు. తమ అక్రమాలకు అధికారులు సాయపడటం లేదన్న అక్కసుతో ఇలా నిప్పులు చెరుగుతున్నారన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొన్ని భూములకు సంబంధించి అధికారుల మీద ఆయన ఒత్తిడి చేసినట్టు సమాచారం. మున్సిపాలిటీలో రూ.80 లక్షల బిల్లుకు సంబంధించి ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ సంతకం కోసం డిమాండ్‌ చేసినట్లు ప్రచారం ఉంది. చిరుద్యోగుల తొలగింపు, మహిళా తహసీ ల్దార్‌పై వేధింపులకు పాల్పడడం, వాటిని కప్పిపు చ్చుకునేందుకు తిరిగి పార్టీ కార్యకర్తలతో ధర్నా చే యించడం, అక్రమాలకు సహకరించని అధికారుల పై పనిచేయడంలేదన్న ముద్రవేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బొనేల విజయ చంద్ర అధికారుల పట్ల అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు విమర్శించారు. పార్వతీపురం పట్టణంలోని సుందరయ్య భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు నిబంధనలకు లోబడి పనిచేస్తుంటే, వారిపై ఒత్తిడి తెచ్చి వ్యక్తిగత విమర్శలకు దిగడం అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేయడమేనని ఆరోపించారు. పార్టీ కార్యాలయానికి భూమి కేటాయించలేదనే సాకుతో వివాదాస్పద స్థలాల వద్దకు వెళ్లి బౌండరీ రాళ్లు తొలగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం ప్రజాప్రతినిధికి తగదని హితవు పలికారు. గతంలో ప్రభుత్వ భూములను పార్టీ కార్యాలయాలకు వాడుకోవడాన్ని విమర్శించిన వారు, ఇప్పుడు అదే బాటలో నడవడం సరికాదన్నారు. పార్టీ కార్యాలయం కోసం ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కా ర్యవర్గ సభ్యులు కె.రామస్వామి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement