ఉత్సాహంగా అండర్‌–15 చదరంగం పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా అండర్‌–15 చదరంగం పోటీలు

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

చీపురుపల్లి: జిల్లాస్థాయి అండర్‌ 15 చదరంగం పోటీలు ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగాయి. చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాస జూనియర్‌ కళాశాలలో సోమవారం అండర్‌ 15 జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు హాజరై పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో బాలుర విభాగం నుంచి నలుగురు, బాలికల విభాగం నుంచి నలుగురు చొప్పున రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు నిర్వాహకులు ఏపీవీఎన్‌ఎస్‌. మూర్తి తెలిపారు. ఈ పోటీలకు చీఫ్‌ ఆర్బిటర్‌గా ఏడీఎన్‌ఎస్వీ ప్రసాద్‌ వ్యవహరించారు. పోటీల్లో పాల్గొన్న బాలబాలికలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది వీరే

జిల్లా స్థాయిలో జరిగిన అండర్‌ 15 చదరంగం పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎనిమిది మంది ఎంపికయ్యారు.

బాలుర విభాగంలో..

ఎస్‌వీజీ.కృష్ణ మనోహర్‌ (విజయనగరం)

ఆర్‌.ప్రేమ్‌ కుమార్‌ (నెల్లిమర్ల)

ఎం. ఓంకార్‌ (సారిక)

అనురాగ్‌ విశ్వాస్‌(విజయనగరం)

బాలికల విభాగంలో..

కె. నితీష (విజయనగరం)

ఆర్‌.వెంకట మాధవి మోక్షిత (విజయనగరం)

ఎ. శ్రీనిధి (చింతపల్లి పేట)

కె. కోమల దీప్తి (చీపురుపల్లి)

ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న వారికి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.శంకరరావు, ఎస్సై దామోదర్‌ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement