బాల్యవివాహాలు నిర్మూలిద్దాం | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలు నిర్మూలిద్దాం

May 8 2026 1:25 PM | Updated on May 8 2026 1:25 PM

బాల్యవివాహాలు నిర్మూలిద్దాం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎస్‌ఐలకు శిక్షణ ధాన్యం లోడు లారీ బోల్తా

పాలకొండ: బాల్యవివాహాలు జరకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ పవర్‌ స్వప్నిల్‌ సూచించా రు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో బాల్యవివాహ ల నిరోధక చట్టం–2026 కమిటీతో గురువా రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహలు పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాల్యవివాహలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చట్టం అమలుకు శిశుసంక్షేమ, రెవెన్యూ, పోలీస్‌ శాఖ లు సమష్టి బాధ్యతీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎం.రాంబాబు, డివిజన్‌ పరిధి లోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సీడీపీఓలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

పార్వతీపురం: ప్రజల భూసమస్యలను త్వరితగతిన పరిష్కరించి, రెవెన్యూ సేవల్లో పారదర్శకత పంచడమే లక్ష్యమని జాయింట్‌ కలెక్టర్‌ సి. యశ్వంత్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. మండలంలో ని గోపాలపురంలో ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు కార్యక్రమంపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. వెబ్‌ల్యాండ్‌ తప్పుల సవరణ, సర్వేనంబర్‌ సమస్యలు, మ్యుటేషన్‌, సాదా బైనామాక్‌లైమ్‌ లు, భూ వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులో పరిష్కరించి ప్రజలకు పారదర్శక సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

విజయనగరం క్రైమ్‌: రాష్ట్ర వ్యాప్తంగా 265 మంది ఎస్‌ఐలకు ప్రీ ప్రమోషనల్‌ ట్రైనింగ్‌కు గురువారం రాష్ట్ర పోలీస్‌శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న నాలుగు పోలీస్‌ శిక్షణ కళాశాలలైన విజయనగరానికి 51 మంది, ఒంగోలుకు–38, తిరుపతికి 50, అనంతపురానికి 126 మందిని శిక్షణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షణ ఈ నెల పది నుంచి జూన్‌ 20వరకు కొనసాగనుంది. విజయనగరం పోలీస్‌ శిక్షణ కళాశాలకు 51 మంది మెన్‌ ఎస్‌ఐలు శిక్షణకు రానున్నారు. ఒంగోలు కు 38మహిళ ఎస్‌ఐలు శిక్షణకు వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వంగర: ధాన్యం లోడుతో వీరఘట్టం నుంచి వంగర వైపు గురువారం వస్తున్న లారీ వంగర మండలం రుషింగి–కొప్పరవలస గ్రామాల మధ్య పంటపొలాల్లో బోల్తా కొట్టింది. ఇరుకు గా ఉన్న రోడ్డును దాటుతుండగా దిగబడి పంట పొలాల్లోకి బోల్తాపడింది. గంటల తరబడి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే కోండ్రు ముర ళీమోహన్‌ ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభించలేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆపత్కాలంలో అండగా..

విజయనగరం: రాజకీయాల్లో నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మానవత్వాన్ని చాటుకున్నారు. విధులు ముగించుకుని బుధవారం రాత్రి బొబ్బిలి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విజయనగరం తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శంబంగి శంకరరావుకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దగ్గరుండి చికిత్స చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement