విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా కణపాకలో ఓ చిన్న ఇల్లు..ఆ ఇంటి నుంచి ఒకప్పుడు వినిపించిన గాత్రం ఉత్తరాంధ్ర పల్లెల్ని ఉర్రూతలూగించింది. ఆ గాత్రం దంపుడు లక్ష్మిది. బుర్రకథ అంటే ఏమిటో..జానపద కళలో భావోద్వేగం ఎలా ఉంటుందో? ఒక మహిళ వేదికపై నిలబడి వేల మందిని ఎలా కట్టిపడేస్తుందో తన జీవితంతో చూపించిన కళాకారిణి ఆమె. కానీ జనాలను నవ్వించిన ఆ కళాకారిణి జీవితం మాత్రం నిశ్శబ్దంగా కన్నీళ్ల మధ్య ముగిసింది.
˘õ³§ýl-ÇMýS… Ð]l$«§ýlÅ ç³#sìæt¯]l MýSâê{ç³-Ý릯]l…
చిన్నప్పటి నుంచే లక్ష్మికి కళలంటే ప్రాణం. అప్పట్లో గ్రామాల్లో విద్యుత్ లేదు..టీవీలు లేవు..వినోదానికి జాతరలు, బుర్రకథలే ప్రధాన ఆధారం. గ్రామంలో ఎక్కడ బుర్రకథ వినిపించినా చిన్నారి లక్ష్మి అక్కడికెళ్లి గంటల తరబడి చూసేది. కథ చెబుతున్న వాళ్ల హావభావాలు, పాటలు, సంభాషణలు ఆమెను ఆకట్టుకునేవి. ఆ ఆసక్తే తర్వాత ఆమె జీవితాన్ని బుర్రకథ వైపు నడిపించింది. ఆ రోజుల్లో మహిళలు వేదికపైకి రావడం చాలా అరుదు. అయినా భయపడకుండా బుర్రకథ రంగంలోకి అడుగుపెట్టిన లక్ష్మి, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
˘§ýl…ç³#yýl$ ÌS„ìSà Ð]lçÜ$¢…-§ýl…sôæ FÆý‡…™é ^ólÆó‡¨
ఒకప్పుడు ఉత్తరాంధ్ర గ్రామాల్లో జాతరలో బుర్రకథ తప్పనిసరి. సాయంత్రం కాగానే గ్రామం మధ్యలో చిన్న వేదిక ఏర్పాటు చేసేవారు. నేలమీదే పిల్లలు, పెద్దలు కూర్చుని కథ మొదలయ్యే వరకు ఎదురు చూసేవారు. అప్పుడు దంపుడు లక్ష్మి బుర్రకథ మొదలైతే చాలు..జనాలు మైమరచిపోయేవారు. బాలనాగమ్మ, సీతారామ కల్యాణం, నలదమయంతి, మహాభారతం, రామాయణం..ఏ కథ చెప్పినా తన గాత్రంతో ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగేది. హాస్యం చెప్పి నవ్వించేది.. విషాదం చెప్పి ఏడిపించేది. అంతటి మంత్రముగ్థత ఆమె కళలో ఉండేది.
˘MýSâýæ™ø ´ër$ {ç³fÌZÏ O^ðl™èl-¯]lÅ…..
దంపుడు లక్ష్మి కేవలం వినోదం కోసం మాత్రమే కథలు చెప్పలేదు. బాల్య విహహాలు, అక్షరాస్యత, మహిళా హక్కులు, ఎయిడ్స్ నియంత్రణ, పొదుపు సంఘాలు, పనికి ఆహార పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా ఊరూరా తిరిగి బుర్రకథల రూపంలో ప్రజల్లో అవగాహన కల్పించింది. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు కూడా దంపుడు లక్ష్మి బృందం వస్తే ప్రజలకు విషయం త్వరగా చేరుతుందని ప్రత్యేకంగా ప్రోగ్రాములు పెట్టేవారు. విజయనగరం మాత్రమే కాదు..ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఆమె ప్రదర్శనలు ఇచ్చింది.
˘f¯éÌS ^èlç³µsôæÏ M>± yýlº$¾ Æ>Ìôæ§ýl$
వేదికలపై చప్పట్లు కొట్టిన జనాలు వేలమంది. కానీ ఆ చప్పట్లు ఆమె జీవితాన్ని నిలబెట్టలేకపోయాయి. కళను నమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చిన లక్ష్మి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరి పోరాటం..అన్నింటినీ భరించింది. ఒక కుమారుడిని కష్టపడి పెంచి పెద్ద చేసింది. అయితే కళాకారిణిగా ఆమెకు పేరు వచ్చినా..జీవితంలో మాత్రం స్థిరత్వం రాలేదు.
˘yìlhrÌŒæ Ķæ¬VýS….. MýS¯]l$-Ð]l$-Æý‡$-OVðS¯]l º${Æý‡MýS£ýl
కాలం మారింది. టెలివిజన్ వచ్చింది. తర్వాత సినిమాలు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వచ్చాయి. గ్రామాల్లో జాతరల వేదికలపై బుర్రకథల స్ధానంలో రికార్డింగ్ డ్యాన్సులు వచ్చాయి. ఒకప్పుడు రాత్రంతా కూర్చుని బుర్రకథలు విన్న ప్రజలు.. ఇప్పుడు మొబైల్ స్క్రీన్స్‌పై వినోదం వెతుక్కుంటున్నారు. కొత్త తరం జానపద కళల వైపు చూడకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్ల బుర్రకథలు క్రమంగా కనుమరుగయ్యాయి. ఆ కళను నమ్ముకున్న కళాకారులు బతుకు కోసం ఇతర పనులు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
˘_Ð]l-ÇMìS MýS*Æý‡V>-Ķæ$ÌS §ýl$M>-׿Ðól$ B«§éÆý‡…
ఒకప్పుడు వేదికలపై వేలాది మందిని అలరించిన దంపుడు లక్ష్మి... చివరికి కలెక్టర్ కార్యాలయం పక్కన చిన్న కూరగాయల దుకాణం పెట్టుకుని జీవనం సాగించింది. అది ఆమె జీవితంలో అత్యంత బాధాకరమైన మలుపు. కళతో గౌరవం వచ్చింది. కానీ బతుకు రాలేదు. అనారోగ్యం వెంటాడినా.. మందులకు డబ్బు లేకపోయినా..అప్పుడప్పుడు చిన్న ప్రోగ్రాములు చేస్తూనే ఉండేది. కళను వదిలేస్తే నేను బతకలేను అని చెప్పేదామె.
˘MóS¯]lÞ-ÆŠ‡™ø ´ùÆ>-yìl¯]l MýSâê-iÑ™èl…
కేన్సర్ బారిన పడిన తర్వాత ఆమె పరిస్థితి మరింత దయనీయమైంది. వైద్యానికి డబ్బులు సరిపోలేదు. ప్రభుత్వ సహాయం అందలేదు. కళాకారుల పెన్షన్ కూడా ఆమెకు దక్కలేదు. జీవితాంతం ప్రజలకు సందేశాలు చెప్పిన కళాకారిణి.. చివరికి తన బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో మిగిలిపోయింది. ఈ నెల 5 మంగళవారం ఆకస్మాత్తుగా ఆయాసానికి గురై ఆమె తుదిశ్వాస విడిచింది.
బుర్రకథ కళాకారిణి దంపుడు లక్ష్మి మృతి
ప్రభుత్వ పథకాల ప్రచారంలో ముందున్న కళాకారిణి
బాల్య వివాహాలపై బుర్రకథలతో
పోరాడిన మహిళ
కళను నమ్ముకున్న జీవితం..ఆదుకోని సమాజం
డిజిటల్ యుగం దెబ్బకు కనుమరుగైన జీవితం


