చిత్తశుద్ధి నిరూపించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేని సీఎం చంద్రబాబు ఇప్పుడేమో ముగ్గురు పిల్లలను కంటే రూ.30 వేలు,నలుగుర్ని కంటే రూ.40 వేలు ఇస్తామనడం హస్యాస్పదంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలను మాయ మాటలతో మభ్యపెట్టి ఇప్పుడు వంచనకు గురి చేసింది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకపోవడం మహిళలను మోసం చేయడమే. కూటమి నేతలు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే గానీ పథకాల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి మహిళల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.

విశ్వాసరాయి కళావతి,మాజీ ఎమ్మెల్యే,పాలకొండ

Advertisement
 
Advertisement
Advertisement