నీట్ పరీక్షలో బాగా రాశా. కీలో చూస్తే 620 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు తగ్గవనుకున్నా. మా తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. ఇంతలో పరీక్షను రద్దుచేశారు. హతాశయులయ్యాం. మళ్లీ ఇంత ప్రిపరేషన్ సాధ్యమా? విద్యార్థుల భవిష్యత్తుపై పిడుగు వేశారు.
– బొట్ట హేమంత్, ఇందిరమ్మ కాలనీ, బొబ్బిలి
ఇది సరికాదు
మా కుమార్తె మాధురి తొలిసారి నీట్ పరీక్ష రాసింది. బాగానే రాయడం వల్ల కీలో కూడా మంచి మార్కులు వచ్చాయి. పరీక్ష రద్దుచేశారని తెలియగానే కుమార్తెతో పాటు తామంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయాం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకోవాలి. ప్రభావం ఉన్నచోట మాత్రమే పరీక్ష రద్దు చేయాలి. – లచ్చుపతుల శ్రీనివాసరావు,
విద్యార్థిని తండ్రి


