భామిని: మండలంలోని బత్తిలి జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న గౌడో అనూష సోమవారం ఢిల్లీ పయనమైంది. రాష్ట్ర విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరారు. ఈ నెల 14న ఢిల్లీలో కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే భారతీయ భాష శిబిరంలో ఒడియా భాష ప్రాముఖ్యతను వివరించనున్నట్టు హెచ్‌ఎం సన్యాసిరావు తెలిపారు. మన రాష్ట్రం నుంచి వివిధ భాషలకు చెందిన ఆరుగురు విద్యార్థుల్లో గౌడో అనూష ఒకరని పేర్కొన్నారు. ఆదివాసీ భాషలకు గుర్తింపు ఇచ్చే క్రమంలో కేంద్రం కోయ, కువి, కొండ, ఆదివాసీ ఒడియా, సవర, సుగాలి భాషల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న భారతీయ భాషా క్యాంపులో బాలిక మాట్లాతుందన్నారు.
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో మలేరియా, టైఫా యిడ్, వైరల్ జ్వరాలు చాపకిందనీరులా వ్యాప్తి చెందుతున్నాయి. సోమవారం మొత్తం ఓపీ 360 రాగా వారిలో 11 మలేరియా ఆర్‌డీ టీ కిట్‌లో పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ఈ నెలలో చూస్తే ఇప్పటి వరకు 60 మలేరియా పాజిటివ్ కేసులు ఒక్క సీతంపేట ఏరియా ఆస్పత్రిలోనే నమోదు కావడం గమనార్హం. చిన్నారుల్లో కూడా మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఒక్క ఏరి యా ఆస్పత్రిలోనే ఇన్ని కేసులు నమోదైతే కుశి మి, దోనుబాయి, మర్రిపాడు పీహెచ్‌సీలతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లలో ఇంతకంటే రెండింతలు ఎక్కువగా మలేరియా పాజి టివ్ కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. లంబగూడకు చెందిన తల్లీకొడుకులు సవర సులోమి, జాను, జొనగకు చెందిన హారి ణి, హారిక, వంబరెల్లికి చెందిన సుచిత్రలతో పాటు పలువురు మలేరియా జ్వరాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల అక్కడక్కడ చిరుజల్లులు కురవడం, దోమల సంతతి పెరగడం వంటి కారణాలతో మలేరి యా వ్యాపిస్తోంది. అలాగే మండే ఎండలకు వైరల్, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ విషయమై స్థానిక ఏరియా ఆస్పత్రి ఆర్‌ఎంవో డీవీ శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా జ్వరాలు వచ్చిన వారికి రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ అనంతరం వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుని
పర్యటన రేపు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఈ నెల 12న విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో పర్యటించనున్నారు. ఆ మేరకు వారి పర్యటన వివరాలను జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఇన్‌చార్జి డీడీ శ్రీనివాసాచారి వెల్లడించారు.


