రేగిడి: రైతులకు సంక్షేమపథకాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన రేగిడి మండలంలోని బూరాడ గ్రామం వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందకపోవడంతో రైతులు తీవ్రనష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఆరుగాలం కష్టించి పండించుకున్న మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోవడంతో దళారులకు విక్రయించి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటా ధర రూ. 2500లు మొక్కజొన్నకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించేదని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు క్వింటా మొక్కజొన్నను రూ.1700లుకు విక్రయించడంతో ఎకరాకు వేలాది రూపాయలు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న సాగునీటి వనరులను సైతం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మడ్డువలస ప్రధాన కుడికాలువకు అనుసంధానంగా ఉన్న పిల్లకాలువలు పూర్తిగా పాడవడంతోపా టు షట్టర్లు, తలుపులు లేకపోవడంతో పంటపొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఇటు రైతు, అటు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కూట మి ప్రభుత్వం హాయిహాయి గారడీగా ప్రభుత్వాన్ని నడుపుతోందని ధ్వజమెత్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు అవసరమైన వరి విత్తనాలు, ఎరువులు రైతు సేవా కేంద్రాలకు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఖరీఫ్‌కు ముందుగానే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచేవారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్


