breaking news
section 498A
-
498 ఏ, పొరుగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?
గృహహింస, వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళలకు చట్టం కల్పించిన రక్షణ సెక్షన్ 498A. వివాహిత స్త్రీ పట్ల భర్త లేదా అతని బంధువుల హింస, వేధింపులను ఈ చట్టం ద్వారా ఎదుర్కోవచ్చు. వివాహంబంధంలో అత్తింటి వారినుంచి తనకెదురైన ఇబ్బందులు, బాధలనుంచి విముక్తి పొందేందుకు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. అయితే ఈ కేసులో పొరుగింటివారి మీద కూడా కేసు నమోదు చేయవచ్చా? వారిని కూడా నిందితులుగా పేర్కొనవచ్చా? చట్టం ఏ చెబుతోంది? దీనిపై కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది?సెక్షన్ భారత శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 498A ప్రత్యేకంగా భర్త లేదా అతని బంధువులపై కేసు నమోదు చేయవచ్చు. ఎవరైనా, ఒక స్త్రీ భర్త లేదా భర్త బంధువు అయి ఉండి, ఆ వివాహితను క్రూరంగా హించినట్టు రుజువైతే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాకు కూడా విధించే అవకాశం ఉంది.అయితే ఒక కేసులో తన పొరిగింటి మహిళను విచారించాలని ఒక ఫిర్యాదు దారు కోరింది. ఈ కేసులో ఫిర్యాదు దారైన మహిళకు 2006లో జరిగిన వివాహం అయింది. వైవాహిక కలహాలు తలెత్తడంతో భర్తపై కేసు నమోదు చేసింది. హింసకు పాల్పడుతున్నాడంటూ భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలు, పొరుగింటి మహళ తన భర్తను రెచ్చగొట్టిందని ఆరోపించింది. దీంతో పోలీసులు భర్తపైనే కాకుండా, పొరుగువారిపై కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌లో ఐపీసీలోని సెక్షన్లు 498A, 504, 506 మరియు 323 కింద కేసులు నమోదు చేయడంతో, ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది చందన్ కె వాదిస్తూ, ఆమెకు ఇతర నిందితుల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా ఈ వివాదంలోకి లాగారన్నారు. భర్తను రెచ్చగొట్టిందనేది మాత్రమే ఆమెపై మోపిన ఏకైక ఆరోపణ అని, వ్యక్తిగత కక్షతో, ఆమెను నిందితురాలిగా చేర్చారని, ఈ కేసునుంచి ఆమెను తొలగించాలని వాదించారు.ప్రాసిక్యూషన్ ఈ పిటిషన్‌ను వ్యతిరేకించింది. న్యాయవాది కె నాగేశ్వరప్ప వాదిస్తూ, పొరుగున ఉన్న మహిళ భర్త ప్రవర్తనను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించిందని , "భర్త అన్ని ప్రవర్తనలకు ఆమెనే కారణం" అని పేర్కొన్నారు. కాబట్టి ఆమె విచారణను ఎదుర్కొని, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆయన వాదించారు.ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్అయితే రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత, సెక్షన్ 498A కింద ఆమెను నిందితురాలిగా చేర్చడానికి తగిన కారణాలేవీ లేవని కోర్టు గుర్తించింది. దీనిపై జస్టిస్ నాగప్రసన్న తీర్పునిస్తూ పిటిషనర్ పేరు కేవలం ప్రేరేపణ ఆరోపణల సందర్భంలో మాత్రమే వెలుగులోకి వచ్చిందని, కానీ ఆమె చట్టంలోని నిబంధన ప్రకారం కుటుంబం అనే నిర్వచనంలోకి రారని పేర్కొన్నారు. ఈ కేవలం ఆరోపణ తప్ప, చట్టం ప్రకారం క్రూరత్వానికి పాల్పడిన చర్యలలో ఆమె ప్రమేయం రాదని చెప్పారు. భర్త ,భార్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఐపిసి సెక్షన్ 498A కింద నేరాలకు సంబంధించిన విచారణలో ఒక అపరిచితురాలిని చేర్చలేరని ఆ ఉత్తర్వు నొక్కి చెప్పింది. అంతేకాదు ఈ కేసులో పొరుగింటి మహిళపై కేసును అనుమతించడం, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. భర్త కుటుంబంలో భాగం కాని వ్యక్తి ఈ నిబంధన పరిధిలోకి రాదని, అందువల్ల, ఆమె విచారణను ఎదుర్కోవలసిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!అలాగే రమేష్ కన్నోజియా మరియు మరొకరు వర్సెస్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ,మరొకరి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
వరకట్న వ్యతిరేక చట్టాలకు కోరల్లేవు
న్యూఢిల్లీ: వరకట్న భూతాన్ని సమూలంగా రూపుమాపడం తక్షణావసరం అని అత్యున్నత న్యాయస్థానం సోమవారం అభిప్రాయపడింది. అయితే వరకట్న వ్యతిరేక చట్టాలు ఆచరణలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. పైగా తరచూ వాటి దుర్వినియోగం జరుగుతుండటం మరో ఆందోళనకర పరిణామం. దాంతో మన దేశంలో వరకట్న దురాచారం ఇప్పటికీ నిర్ని రోధంగా కొనసాగుతూనే ఉందని న్యాయ మూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఆవేదన వెలిబు చ్చింది. 24 ఏళ్లనాటి వరకట్న హత్య కేసులో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇద్దరు నిందితులను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వారికి జీవిత ఖైదు విధించడమే సరైనదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘కేవలం కలర్ టీవీ, మోటార్ సైకిల్, రూ.25 వేలు ఇవ్వలేదని నవ వధువును కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. అయితే నిందితుల్లో మహిళకు ఇప్పుడు 94 ఏళ్లు గనుక ఆమెకు తీర్పు అమలు కాబోదు. రెండో వ్యక్తి మాత్రం 4 వారాల్లో లొంగిపోవాలి‘ అని ఆదేశించింది. వరకట్న దురాచారం విషయమై కేంద్ర రాష్ట్రాలకు, దిగువ కోర్టులకు ఈ సందర్భంగా పలు నిర్దేశాలు చేసింది. పెండింగ్ లో ఉన్న వరకట్న హత్యలు (సెక్షన్ 304–బి), భర్త, అత్తింటివారి హింస (398–ఏ) కేసులపై హైకోర్టులు మరింతగా దృష్టి పెట్టాలి. వరకట్నం సాంఘిక దురాచారమని మన భావితరాలకు తెలియాలి. ఆ మేరకు బాలల్లో అవగాహన కలిగేలా విద్యా ప్రణాళికల్లో కేంద్రం, రాష్ట్రాలు అవసరమైన మార్పులు చేయాలి. చట్టం పేర్కొన్న మేరకు వరకట్న నిషేధ అధికారులను రాష్ట్రాలన్నీ తక్షణం నియమించాలి. వారికి అవసరమైన అన్ని అధికారాలు, సాధన సంపత్తి కట్టబెట్టాలి. వారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబరు, మెయిల్ ఐడీలను అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలి. వరకట్న కేసులను విచారించే పోలీసు, న్యాయాధికారులకు ఇందుకు సంబంధించిందిన అంశాలపై తరచూ శిక్షణ ఇవ్వాలి‘ అని సూచించింది. -
Supreme Court of India: ఇవేం బెయిల్ షరతులు!
న్యూఢిల్లీ: వైవాహిక విభేదాల కేసుల్లో ముందస్తు బెయిల్ షరతుల విషయంలో కోర్టులు అసాధ్యమైన షరతులు విధిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. వరకట్న నిషేధ తదితర చట్టాల కింద ఆరోపణలెదుర్కొంటున్న ఓ వ్యక్తికి పట్నా హైకోర్టు విధించిన ముందస్తు బెయిల్ షరతులపై ధర్మాసనం శుక్రవారం విస్మయం వెలిబుచ్చింది. దంపతులు కలిసుండేందుకు ఒప్పుకోవడంతో దిగువ కోర్టు వారిని ఉమ్మడి అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకునే షరతుపై పిటిషనర్‌కు బెయిలిచ్చేందుకు అంగీకరించింది. అయితే, ‘గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు, ఆమె శారీరక, ఆర్థిక అవసరాలన్నిటినీ తీర్చుతానని హామీ ఇవ్వండి’ అని షరతు పెట్టింది. దీన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ షరతును తొలగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆచరణ సాధ్యం కాని షరతులను ఇవ్వొద్దని కోర్టులకు సూచించింది. గౌరవంగా జీవించే హక్కును గుర్తించాలని, విచారణ న్యాయబద్ధంగా సాగేలా చూడాలని కోరింది. -
దేశంలో దుర్వినియోగంకాని చట్టం ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : షెడ్యూల్ కులాలు, తెగల వేధింపుల నిరోధక బిల్లు అమల్లోకి వచ్చిన దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్టు ఈ బిల్లు దుర్వినియోగం అవుతోందని, దీన్ని సడలించాల్సిన అవసరం ఉందని భావించడం విచిత్రం. ఆ మాటకొస్తే ఈ బిల్లుపై ఎప్పటి నుంచో అలాంటి ప్రచారం ఉంది. ఇంతకు ఆ ప్రచారం ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వారి ప్రచారంలో నిజముందా ? నిజంగానే చట్టం దుర్వినియోగం అవుతుందా ? అయితే ఎందుకు అవుతుంది ? ఇలాంటి అంశాలన్నింటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన బాధ్యత సుప్రీం కోర్టుది. మరి అలాంటి కోర్టే చట్టం దుర్వినియోగం అవుతుందని అభిప్రాయపడింది. సమాజంలో వివిధ వర్గాల వేధింపుల నుంచి ఎస్సీ, ఎస్టీలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 1989లో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీల చట్టంగా పిలుస్తారు. సుప్రీం కోర్టు మాత్రం ఈ చట్టాన్ని ఈ నెల 20వ తేదీన అట్రాసిటీల చట్టంగా పేర్కొంది. ఈ చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా నిందితులను అరెస్ట్ చేయవచ్చనే నిబంధనను తక్షణం తొలగించాలంటూ ఆదేశించింది. ఈ చట్టం కింద ఫిర్యాదు అందితే పోలీసులు విధిగా వారం రోజుల్లోగా ప్రాథమిక దర్యాపు జరిపి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని సూచించింది. ఈ చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయాల్సి వస్తే, వారి పై అధికారి నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోవాలని కూడా సూచించింది. ఇప్పుడు ఈ సూచనలు చేసిన జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏకే గోయెల్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనమే ఇంతకు ముందు వరకట్నంను నిరోధించే భారతీయ శిక్షా స్మృతిలోని 498ఏ సెక్షన్ కూడా దుర్వినియోగం అవుతోందని ఆరోపించింది. అరెస్ట్‌లకు ముందే ఆరోపణలు నిజమైనవా, కావా? అన్న విషయాన్ని ఒకటి, రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని సూచించింది. అయితే, ఈ సూచనలను ఆ తర్వాత మూడు నెలలకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని మరో బెంచీ కొట్టి వేసింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీం కోర్టు సూచించిన సవరణలను దళిత, ఆదివాసి గ్రూపులు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సమాజంలో ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా రోజు రోజుకూ దాడులు పెరుగుతుంటే ఈ సెక్షన్ కింద శిక్షలు మాత్రం ఎందుకు తగ్గుతున్నాయని ఆ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) కూడా ఈ విషయాన్ని రుజువు చేసున్నాయి. 2009 నుంచి 2014 వరకు ఎస్సీలపై దాడులు 40 శాతం పెరగ్గా, షెడ్యూల్డ్ తెగలపై 118 శాతం పెరిగాయి. 2007 నుంచి 2016 మధ్య ఈ చట్టం కింద ఎస్సీలపై జరిగిన దాడుల్లో 28.8 శాతం కేసుల్లో శిక్షలు పడగా, షెడ్యూల్ తెగల కేసుల్లో 25. 2 శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. అన్ని నేరాలకు సంబంధించిన మొత్తం కేసుల్లో భారతీయ శిక్షాస్మృతి కింద 42.5 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఒక్క 2016 సంవత్సరంనే ప్రమాణంగా తీసుకుంటే ఎస్సీ కేసుల్లో 25.7 శాతం కేసుల్లో, ఎస్టీ కేసుల్లో 20.8 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. అదే అన్ని నేరాలకు సంబంధించిన కేసుల్లో 46.8 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో శిక్ష పడుతున్న కేసులు జాతీయ సగటు కన్నా కొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువగాను ఉంటున్నాయి. 2016వ సంవత్సరాన్నే ప్రమాణికంగా తీసుకుంటూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీల చట్టం కింద ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. అదే కర్ణాటకలో రెండు శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఎస్సీ, ఎస్టీల చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో అమాయకులను ఈ చట్టం కింద ఇరికించే ప్రమాదం కూడా ఉందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్రం ఆదేశాల మేరకు ఇదివరకే పోలీసులు ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపి ఈ చట్టం కింద దాఖలైన కేసుల్లో 9 నుంచి పది శాతం కేసుల్లో మాత్రమే చట్టం దుర్వినియోగం జరిగినట్లు తేల్చారు. ఆ మాటకొస్తే అన్ని చట్టాల్లోనూ దుర్వినియోగం అవుతున్న సందర్భాలు కనిపిస్తాయి. ఎస్సీ, ఎస్టీల చట్టం దుర్వినియోగం అవుతోందని, దాన్ని సవరించాలంటూ గతేడాది ముంబైలో దాదాపు మూడు లక్షల మందితో ర్యాలీ నిర్వహించారు మరాఠీలు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించగా ఒక్క కేసులో కూడా దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని మహారాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన అధికారిక నివేదికలో స్పష్టం చేశారు. ప్రతి చట్టం కింద తప్పుడు కేసులు నమోదవడం కొత్త విషయం ఏమీ కాదని, ఏ చట్టం అందుకు మినహాయింపు కాదని ముంబై హైకోర్టులో మానవ హక్కుల కేసులనే వాదించే న్యాయవాది మిహిర్ దేశాయ్ కూడా తెలిపారు. ఎక్కువ కేసులు దాఖలైనప్పటికీ తక్కువ కేసుల్లో శిక్షలు పడ్డాయంటే మిగతా కేసులన్నీ తప్పుగా దాఖలైన కేసులు కావని ఆయన అన్నారు. ‘ప్రొసీజర్ లాప్సెస్’, అంటే దర్యాప్తు సందర్భంగా, కోర్టు విచారణ సందర్భంగా తప్పులు జరగడం వల్ల కేసులను కొట్టి వేస్తారని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ లాంటి చట్టాలకు సంబంధించిన కేసులను ఉన్నత స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు జరపాలని చట్టం నిర్దేశిస్తోందని, అయినా పని ఒత్తిడి కారణంగానో, మరో కారణంగానో ఈ కేసుల దర్యాప్తును దిగువ స్థాయి పోలీసులకు కూడా అప్పగిస్తున్నారని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో సాధారణంగా తక్కువ శిక్షలు పడడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ కేసుల్లో నిందితులు పలుకుబడి కలిగిన వ్యక్తులు కావడం వల్ల నిందితులపై ఒత్తిడి తెచ్చి రాజీ చేసుకుంటారు. బాధితులు తాము ఎస్సీ లేదా ఎస్టీలమంటూ సరైన ఆధారాలు చూపించలేకపోతారు. కుల వివక్ష కారణంగానే తమపై దాడి జరిగిదంటూ బాధితులు నిరూపించలేకపోతారు. వారికి దర్యాప్తు అధికారుల సహకారం కూడా అంతంత మాత్రమే. దుర్వినియోగం జరుగుతోంది కనుక మహిళలకు సంబంధించి 498ఏ సెక్షన్‌ను, ఈ ఎస్టీ, ఎస్టీల చట్టాలను కొట్టివేయాలనుకుంటే ఇంతకన్నా దుర్వినియోగం అవుతున్న చట్టాలు, సెక్షన్లు ఇంకా ఎక్కువనే ఉన్నాయి. యూఏపీఏ (అన్‌లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్), ఢిల్లీ విఐపీ ప్రాంతాల్లో నిత్యం అమల్లో ఉండే 144వ సెక్షన్ అన్ని చట్టాలకన్నా ఎక్కువ దుర్వినియోగం అవుతున్నాయి. -
చనిపోయిన భర్తపై కట్నం వేధింపుల కేసు
గురుగావ్: అత్తమామలను వేధింపులకు గురిచేసేందుకు, భర్త నుంచి సులభంగా విడాకులు తీసుకొని భరణం పొందేందుకు కొంత మంది మహిళలు భారతీయ శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న విషయం తెల్సిందే. ఉత్తరప్రదేశ్‌లోని గురుగావ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, చట్టంలోని ఓ సెక్షన్ ఎక్కువే చదివినట్టున్నది... భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయిన మరుసటి రోజున భర్తతోపాటు, అత్తమామలపై వరకట్న వేధింపుల కేసును దాఖలు చేసింది. బ్యాంకర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల రాకేశ్ పిలానియా అక్టోబర్ ఐదవ తేదీన తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మరుసటి రోజే భార్య , భర్త,అత్తమామలపై డౌరీ కేసును దాఖలు చేసిందని 498ఏ సెక్షన్ దుర్వినియోగంపై డాక్యుమెంటరీ తీస్తున్న ఫిల్మ్‌మేకర్, జర్నలిస్ట్ దీపక్ భరద్వాజ్ తెలిపారు. ఈ కేసులో రాకేశ్ చనిపోయినందున ఆయన్ని కేసు నుంచి తప్పిస్తారని, అయితే బంధువులపై మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. భర్త ఆత్మహత్యకు కారకురాలిగా భావించి ఆమెను అరెస్టు చేయకుండా, కేసు పెట్టకుండా ఉండేందుకే ఆమె ఈ వరకట్నం కేసును దాఖలు చేసి ఉండవచ్చని భరద్వాజ్ అనుమానం వ్యక్తం చేశారు. 498ఏ సెక్షన్ దుర్వినియోగానికి ఇది మరో చక్కటి ఉదాహరణని ఆయన వ్యాఖ్యానించారు. ‘పది లక్షల రూపాయలు కావాలని వేధిస్తున్నట్టు కేసు పెడతానంటూ మమ్మల్ని, మా అబ్బాయిని కోడలు తరచుగా బెదిరించేది. ఆ బెదిరింపులు, వేధింపులను భరించలేకనే నా కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు’ అని రాకేశ్ తండ్రి ఆనంద్ ప్రకాష్ పిలానియా మీడియాకు తెలిపారు. ఇదే విషయమై రాకేశ్ భార్యను కూడా మీడియా సంప్రదించగా మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.


