తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సక్సెస్‌ స్టోరీ | A woman came from a farming family recently recounted her journey Goes Viral | Sakshi
Sakshi News home page

తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సక్సెస్‌ స్టోరీ

Sep 18 2025 10:56 AM | Updated on Sep 18 2025 2:43 PM

A woman came from a farming family recently recounted her journey Goes Viral

ఇంటి పెద్దనే కొల్పోతే ఆ కుటుంబం ఓ పెద్ద కుదుపుకులోనై కోలుకోవడం అంత సులభం కాదు. ఆదుకునే వాళ్లు ఉంటే పర్లేదు, బరువు అనుకుంటే ఆ కుటుంబ ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతూ నరకం చవిచూస్తుంది. అలాంటి సమయంలో స్థిరమైన తెగువతో పోరాడే వాళ్లే..యావత్తు ప్రపంచం తమవైపుకి తిప్పుకునేలా సక్సెస్‌ని అందుకుంటారు. అలాంటి విజయాన్నే అందుకుంది ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజీనర్‌. ఆమె సక్సెస్‌స్టోరీ ఆర్థిక ఇబ్బందులతో గెలుపుని అందుకోలేకపోతున్నామని సతమతమై యువతకు ఆదర్శం. నెట్టింట ఈ టెక్కీ స్టోరీ వైరల్‌గా మారింది. 

రెడ్‌ఇట్‌లో వ్యవసాయ కుటుంబ నేపథ్యానికి చెందని ఓ యువతి తాను టెక్నాలజీ రంగంవైపు అడుగులు వేసి ఎలా గొప్ప సక్సెస్‌ని అందుకుందో నెట్టింట షేర్‌చేసుకుంది. సుమారు వంద కుటుంబాలు ఉండే ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన తాను టీనేజ్‌ వయసులోనే తండ్రిని కోల్పోయానంటూ మర్చిపోలేని నాటి ఆవేదనను గుర్తుచేసుకుంది. 

తన తండ్రి ఒక రైతుగా అవిశ్రాంతంగా పనిచేసేవాడని, ఉన్నటుండి వచ్చి పడిన అనారోగ్యం ఆయన్ను మింగేసిందంటూ తనకు కన్నీళ్లు మిగిల్చిన నాటి విషాదం గురించి చెప్పుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా ఆర్థిక సమస్యలు చుట్టుమట్టాయని, మరోవైపు బంధువులు తమను దూరం పెడుతూ ఎంత మానసిక ఆవేదన కలిగించారో చెప్పుకొచ్చింది. డబ్బుంటేనే బాంధవ్యాలని గ్రహించేలోపే కళ్లముందు అంతా చీకటి, ఈ సమస్య నుంచి గట్టేక్కుతామో లేదో తెలియని పరిస్థితి..ఆ సమయంలో తనకు చదువే వీటన్నింటికి పరిష్కారమని ప్రగాఢంగా నమ్మింది. 

ఎంతటి ఆర్థిక పరస్థితుల్లోనూ కూడా చదవడం ఆపలేదు, పైగా పాఠశాల నుంచి కాలేజీ వరకు అన్నింట్లోనూ టాపర్‌గా నిలింది. అలా ఆమె కర్ణాటక కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కి ప్రిపేరయ్యి వందలోపు ర్యాంక్‌ సాధించింది. ఆ నేపథ్యంలోనే ఆమెకు బెంగళూరులోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీటు పొందే ఛాన్స్‌ అందుకుంది. అదే ఆమె జీవితాన్ని పెద్ద యూటర్న్‌ తీసుకునేలాచేసింది. ఓ పక్క పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు తన లక్ష్యాన్ని మరింతగా పెంచేశాయి.

పట్టుదలతో ఈ ఆర్థికకష్టాలకు చెక్‌పెట్టేలా మంచి కెరీర్‌ని ఏర్పరచుకునేలా సన్నద్ధమైంది. అలా సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి అడుగుపెట్టి..సుమారు ఆరు ఏళ్ల నిర్విరామ కృషితో..దాదాపు రూ. 80 లక్షల వార్షిక ప్యాకేజ్‌ని అందుకుని అందరినీ విస్తుపోయేఆల చేసింది. రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను ఇంత పెద్ద మొత్తంలో వేతనం అందుకునే స్థాయికి చేరుకోవడం గురించి ఆలోచిస్తే చాలా గర్వంగా అనిపిస్తోందంటూ ఆనందం వ్యక్తం చేసింది. 

అమూల్యమైన మాటలు..
తండ్రి లేకపోవడం అనేది పూడ్చుకోలేని బాధ అయినా..తాను సాధించిన ఈ విజయాన్ని తన తండ్రి ఎక్కడ నుంచే చూస్తూనే ఉంటాడని, ఆనందపడతానని నమ్ముతానని అంటోందామె. అలాగే తనలాంటి కష్టాలు అనుభవించే వాళ్లేందరో ఉన్నారని, వారందరూ కష్టాలను దురదృష్టంగా చూడకపోతే కచ్చితంగా సక్సెస్‌ సాధిస్తారని అంటోంది. ఎప్పుడైనా చుట్టుముట్టే కష్టాలు, కన్నీళ్లు ఎన్నింటినో నేర్పించడమే కాదు.. లక్ష్యంపై ఫోకస్‌ని చెదరిపోనీవ్వకుండా చేసే సోపానాలని అంటుంది. 

చూసే దృక్పథం మీదే సక్సెస్‌ అదృష్టం ఆధారపడి ఉంటుందని చెబుతోంది. బాధలు ఎప్పుడు బరువు కాదు బాధ్యతగా వ్యవహరించడం నేర్పిస్తాయి, బలోపేతంగా ఉండటం ఎలానో తెలియజేస్తాయని చెబుతోంది. అందుకు కావాల్సింది ఓర్చుకునే సహనం, పట్టుదల అని, అవే అసలైన ఐశ్వర్యాలని మరవకండి అంటూ పోస్ట్‌ని ముగించింది. నెటిజన్లు సైతం అద్భుతం మీ విజయం అంటూ ఆ టెక్కీని ప్రశంసించారు. అంతేగాదు మరోనెటిజన్‌ తాను కూడా అలానే కష్టపడి చదివి పైకొచ్చానని, మీ సక్సెని ఇక్కడితో ఆపోద్దు, ఈ ప్రపంచం నీదే అని ‍ప్రోత్సహిస్తూ పోస్టులు పెట్టారు.

(చదవండి: 'రిచ్‌'..రుచి! ఇడ్లీ రూ.1200, చాక్లెట్‌ రూ.1800)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement