
గచ్చిబౌలి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం పట్టణం, గాంధీనగర్‌కు చెందిన చింతల యామిని (27) ఇందిరానగర్‌లోని జేకే పీజీ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది.
మంగళవారం ఉదయం ఖమ్మం వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు బయలుదేరిన ఆమె వాంతులు కావడంతో కొద్దిసేపటికే హాస్టల్‌కు తిరిగి వచి్చంది. అనంతరం తన రూమ్మేట్స్ నిఖిత, రాణిలతో కలిసి టిఫిన్ చేసి హాస్టల్‌లోనే ఉండిపోయింది. ఆఫీసుకు వెళ్లిన ఆమె స్నేహితులు సాయంత్రం గదికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ నిర్వాహకుల సహాయంతో కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగా కిటికీ గ్రిల్‌కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది.
పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యామినికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాకపోవడంతో పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. బుధవారం పోస్టు మార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
