కన్నవారి రుణం తీర్చుకున్నావమ్మా.. | - | Sakshi
Sakshi News home page

కన్నవారి రుణం తీర్చుకున్నావమ్మా..

Oct 9 2024 1:24 AM | Updated on Oct 9 2024 12:35 PM

కన్నవారి రుణం తీర్చుకున్నావమ్మా..

కన్నవారి రుణం తీర్చుకున్నావమ్మా..

పాలకొల్లు సెంట్రల్‌: జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకుంది ఓ కూతురు. పాలకొల్లు పట్టణంలోని 22వ వార్డు కొత్తపేట ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి చైతన్య సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌. వృత్తిరీత్యా ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారు. గతేడాది డిసెంబర్‌ 31న తల్లి పుణ్యవతిదేవి మృతి చెందగా బంధువులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో చైతన్య తలకొరివి పెట్టింది. ఆమె తండ్రి బాపయ్యనాయుడు (70) గత కొన్నేళ్లుగా మంచానికే పరిమితమై ఉన్నారు. 

ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె తండ్రిని చూసుకోవడానికి ఒక మనిషిని ఏర్పాటుచేసి నిత్యం తండ్రి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. గత ఆదివారం తండ్రి ఆరోగ్యం మరీ క్షీణించడంతో స్థానికుల సహకారంతో పట్టణంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం పాలకొల్లు వచ్చిన ఆమె ఆసుపత్రిలో ఉన్న తండ్రిని చూసుకుంటుంది. వారం రోజులుగా చికిత్స పొందుతున్న బాపయ్యనాయుడు మంగళవారం మృతి చెందాడు. తలకొరివి పెట్టడానికి బంధువులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో తల్లికి చేసినట్లుగానే తండ్రికి కూడా చైతన్య అంత్యక్రియలు నిర్వహించి కన్నవారి రుణం తీర్చుకుంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement