న్యూస్‌రీల్
పొగాకు రైతు కుటుంబానికి సాయం
గుండెపోటుతో మృతి చెందిన పొగాకు రైతు పాలా వెంకటేశ్వరరావు కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన రూ.2 లక్షల సాయం చెక్కును అందజేశారు. 8లో u
వైఎస్సార్‌సీపీ శ్రేణులు సోమవారం తలపెట్టిన నిరసన ర్యాలీలకు సర్కారు అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. ర్యాలీకి అనుమతి లేదని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో కేవలం 10 మందితో నిరసన తెలపాలని లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హడావుడి చేసి నియోజకవర్గ సమస్వయకర్తలకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణలో భూమికి బదులు భూమిని కేటాయించాలని ఎంత మొరపెట్టుకున్నా అధికారుల నుంచి స్పందన కరువైంది. 8లో u
మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: డీఎస్సీ–2025 అక్రమాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదంతొక్కాయి. అర్హులకు న్యాయం చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్‌తో జిల్లా వ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణ రూపొందించి గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించింది. యువత, నిరుద్యోగులతో కలిసి ఇప్పటికే అధికారులకు వినతిపత్రాలు అందచేశారు. గత నాలుగు రోజులుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. సోమవారం అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు.
కై కలూరు నియోజకవర్గంలో..
కై కలూరు నియోజకవర్గం కలిదిండిలో ముఖ్యమంత్రి పర్యటన పేరుతో జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతో ఆయన పోలీసుల తీరుపై నిరసన తెలిపారు.
దెందులూరు నియోజకవర్గంలో..
దెందులూరు నియోజకవర్గంలో సమన్వయకర్త అబ్బయ్యచౌదరి నేతృత్వంలో పెదవేగి మండలం కొండలరావుపాలెంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెదవేగి పోలీసులు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిని ఏలూరు పార్టీ కార్యాలయానికి తరలించారు.
ఏలూరు నియోజకవర్గంలో
ఏలూరు నియోజకవర్గంలో సమస్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏలూరు వన్‌టౌన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డంకులు సృష్టించినా పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. ప్రశాంత వాతావరణంలో నిరసన తెలియజేసే హక్కు తమకు ఉందని స్పష్టం చేస్తూ ర్యాలీని కొనసాగించారు.
నూజివీడు నియోజకవర్గంలో..
నూజివీడు నియోజకవర్గంలో సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణలో తీవ్ర అవకతవకలు, అక్రమాలకు పాల్పడుతుందన్నారు.
పోలవరం నియోజకవర్గంలో..
పోలవరం నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో 7 మండలాల్లో నాయకులు, కార్యకర్తలు, యువత బుట్టాయగూడెం నుంచి జీలుగుమిల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇతర ప్రాంతాల నుంచి కొందరు డీఎస్సీలో ఎంపికై న ఉద్యోగులను తెచ్చి రెచ్చగొడుతుందని ఆరోపించారు.
ఉంగుటూరు నియోజకవర్గంలో..
నియోజకవర్గంలో సమస్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరులో హైవే నుంచి పంచాయతీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.
కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
కై కలూరులో నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ గృహనిర్బంధం
ర్యాలీని అడ్డుకుని అబ్బయ్యచౌదరిని ఏలూరుకు తరలించిన పోలీసులు
ఏలూరు, పోలవరం, నూజివీడు, ఉంగుటూరులో భారీ ర్యాలీలు


