డీఎన్నార్‌ గృహనిర్బంధం | - | Sakshi
Sakshi News home page

డీఎన్నార్‌ గృహనిర్బంధం

Aug 11 2026 1:36 AM | Updated on Aug 11 2026 1:36 AM

వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నినాదాలతో దద్దరిల్లిన డీఎన్నార్‌ నివాసం

ముఖ్యమంత్రి సభ పేరుతో ర్యాలీపై ఆంక్షలు

కై కలూరు: డీఎస్సీ–2025 అవకవతకలపై నాలుగు రోజుల రిలే దీక్షల అనంతరం సోమవారం చేపట్టాల్సిన నిరనన ర్యాలీని కై కలూరు పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌)ను ఆయన నివాసం వద్ద హౌస్‌ అరెస్టు చేశారు. ముందుగా ఉదయం 9 గంటలకు కై కలూరు రైల్వేస్టేషన్‌ పార్టీ కార్యాలయం నుంచి సంతమార్కెట్‌ దివంగత వైఎస్సార్‌ విగ్రహం వద్దకు శాంతియుత ర్యాలీ చేయా లని భావించారు. నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు విచ్చేశారు. ఇంతలో డీఎన్నార్‌ ఇంటి వద్దకు కై కలూరు పట్టణ సీఐ ఏవీఎస్‌.రామకృష్ణ, మరో 10 మంది పోలీసు సిబ్బంది వెళ్ళారు. ఎట్టిపరిస్థితుల్లో ర్యాలీకి అనుమతి లేదన్నారు. విషయం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు డీఎన్నార్‌ ఇంటి వద్దకు వచ్చి మద్దతుగా నినాదాలు చేశారు. శాంతియుతంగా చేస్తామని చెప్పినా పోలీసులు వినలేదు. అవసరమైతే ఏలూరు వెళ్ళి చేయండంటూ పోలీసులు సలహా ఇచ్చారు. చివరకు ఇంటి వద్దే కూర్చుని గంట సమయం డీఎన్నార్‌ నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ పట్టాల పంపణి నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు కై కలూరుకు 13 కిలోమీటర్ల దూరంలో కలిదిండికి వచ్చారన్నారు. అంతమాత్రాన పోలీసులు ర్యాలీ జరగకుండా నిరోధించడం అన్నాయమన్నారు. జిల్లా అధ్యక్షుడిని అడ్డుకోవాలనే భావనతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై ప్రజల తరుపున పోరాటం చేస్తున్నామన్నారు. ర్యాలీ అడ్డుకున్నా ప్రజల్లో అభిమానాన్ని అడ్డుకోలేరని చెప్పారు. ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీసీ రాష్ట్ర విభాగ సెక్రటరీలు గంటా సంధ్య, కూసంపూడి కనకదుర్గారాణి, రాష్ట్ర బీసీ సెల్‌ సెక్రటరీ బలే నాగరాజు, యువజన విభాగ కార్యదర్శి గాదిరాజు వెంకట మణికంఠ వర్మ, మైనార్టీ సెల్‌ సెక్రటరీ ఎండీ.గాలీబ్‌బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు మోట్రు ఏసుబాబు, రాచూరి రాధా, శింగంశెట్టి రాము, తిరుమాని రమేష్‌, పెంటా అనిల్‌కుమార్‌, సమయం అంజి, బొబ్బిలి రత్తయ్యనాయుడు, జయమంగళ కాసులు, ఈడే వెంకటేశ్వరరావు, బొమ్మనబోయిన గోకర్ణయాదవ్‌, బండి ప్రసాద్‌, భాస్కరరావు, ఉచ్చుల చినరాజు, మడక శ్రీను, పంజా నాగు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement