
హైదరాబాద్: విద్యుత్ సెంట్రల్ లైటింగ్ పోల్ మీద పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. నాచారం ఇన్‌స్పెక్టర్ రుద్వీర్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున స్థానిక వీఎస్టీ కాలనీకి చెందిన భజరంగ్ యూత్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు.
అదే సమయంలో కార్తీకేయనగర్‌కు చెందిన స్వాథిక్ (23) బైక్ ఆ మార్గంలో వెళుతున్నాడు. మార్గమ«ధ్యలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో వినాయకుడిని తరలిస్తున్న లారీ రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టిన కేబుల్ వైర్‌ను తాకింది. దీంతో రెండు స్తంభాలు విరిగిపోయాయి, ఒక స్తంభం గణేష్ విగ్రహంపై పడగా, మరో స్తంభం విరిగి సాథీ్వక్ తలపై పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వాహనం డ్రైవర్ ఏడుకొండలు, భజరంగ్ యూత్ ఆసోసియేషన్ ఆర్గనైజర్ వెంకటే‹Ùపై పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
వినాయక చవితికి వచ్చి అనంతలోకాలకు..
స్వాథిక్ పూణేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నాచారం వచి్చన అతను బెంగళూరు నుంచి వచి్చన తన స్నేహితుడి కలిసేందుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మృత్యువాత పడ్డాడు.