
కేపీహెచ్‌బీకాలనీ: ఓ యువతి విషయంలో జరిగిన వివాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కొందరు యువకులు దాడి చేసి గాయపర్చారు. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన మేరకు..హిమాయత్‌నగర్‌కు చెందిన మధుగౌడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఈ నెల 15న కేపీహెచ్‌బీకాలనీ రోడ్డునెంబర్–1 వద్ద ఓ యువతితో సన్నిహితంగా ఉండేందుకు సంప్రదించాడు. ఈ క్రమంలో యువతితో వివాదం ఏర్పడడంతో ఆమె తన బంధువైన సోహెల్‌కు ఫోన్ చేసి తెల్పింది .
దీంతో సోహెల్ తన అనుచరులైన సాయికుమార్, బారెడ్డి సిసింధర్ రెడ్డి, బారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్ పాండు, అశ్వనీ కుమార్‌సింగ్‌తో పాటు ఓ మైనర్ బాలుడు, మరికొంతమందితో కలిసి వచ్చి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధుగౌడ్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో గాయపడ్డ అతన్ని ఆస్పత్రిలో చేరి్పంచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మంగళవారం నిందితులను అరెస్టు చేశారు.
