Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య | Software engineer dies by suicide in Sangareddy | Sakshi
Sakshi News home page

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Jul 24 2024 10:32 AM | Updated on Jul 24 2024 11:33 AM

Software engineer dies by suicide in Sangareddy

కుటుంబ సమస్యల వల్లే చనిపోతున్నా..

సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు 

రామచంద్రాపురం(పటాన్‌చెరు): కుటుంబసమస్య వల్లే తాను చనిపోవడానికి కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి ఓ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విద్యుత్‌నగర్‌లో నివాసం ఉండే సాయికిరణ్‌(28) విప్రో సంస్థలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి. అతని చిన్నప్పుడే తల్లి మృతి చెందింది. తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. 

చిన్ననాటి నుంచి ఇస్నాపూర్‌లోని అమ్మమ్మ వద్ద ఉండి చదువుకున్నాడు. విప్రోలో ఉద్యోగం రావడంతో  రెండు నెలలగా విద్యుత్‌నగర్‌లో నివాసముంటున్న తండ్రి నర్సింగ్‌రావు వద్దే ఉంటున్నాడు. బోనాల పండుగ సందర్భంగా తండ్రి, సవతి తల్లి మహాలక్ష్మి శనివారం జోగిపేటకు వెళ్లారు. ఆదివారం సాయికిరణ్‌  మహాలక్షి్మకి ఫోన్‌ చేసి మాట్లాడాడు. మంగళవారం మధ్యాహ్నం వారిద్దరూ తిరిగొచ్చారు. 

ఇంటి తలుపులు వేసి ఉండటంతో ఎంత పిలిచినా తలుపులు తీయడం లేదు. దీంతో కిటికీలో నుంచి చూస్తే సాయికిరణ్‌ తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతిచెందడాన్ని గమనించి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తే మృతుడి వద్ద సూసైడ్‌ నోట్‌ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకుని రెండు రోజులై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement