తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ‘ధరణి’పై సంచలన నిర్ణయం | Telangana Cabinet Approves SIT Probe Into Dharani, Clears Key Development And Recruitment Decisions | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ‘ధరణి’పై సంచలన నిర్ణయం

Jul 17 2026 9:08 PM | Updated on Jul 18 2026 11:11 AM

Telangana Cabinet Key Decisions: Sit Investigation To Dharani

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ (శుక్రవారం) సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ధరణిపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. సిట్‌తో పాటు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖలో పోస్ట్‌ల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సంగారెడ్డిలో భూముల కేటాయింపులకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

పాలమూరు ఎత్తిపోతల అంచనా వ్యయానికి ఆమోదం తెలిపిన కేబినెట్‌.. బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ మార్పులకు ఆమోద ముద్ర వేసింది. పంచాయతీల ఆర్థిక వెసులుబాటుకు ఆమోదం తెలిపిన మంత్రి వర్గం.. 15 కీలక అంశాల ఏజెండాతో కేబినెట్ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement