
ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల కొలువులు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు మాత్రం కంపెనీలు మారుతూ భారీ వేతనాలతో దూసుకుపోతున్నారు. గతంలో ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సౌరభ్ యాదవ్ కేవలం రెండుసార్లు కంపెనీలు మారడంతో తన జీతం భారీగా పెరిగిందని సోషల్ మీడియాలో వివరాలు పంచుకున్నారు. అదికాస్తా వైరల్‌గా మారింది.
‘మొదటి ఉద్యోగం: రూ.26 ఎల్‌పీఏ, సెకండ్: రూ.28 ఎల్‌పీఏ, మూడో ఉద్యోగం: రూ.70 ఎల్‌పీఏ.. నో ఐఐటీ.. నో ఎంబీఏ.. కష్టపడి పనిచేశాను. మీ సంగతేంటి?’ అని సౌరబ్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను ఇప్పటికే 30 లక్షల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
first job: ₹26LPA
second: ₹28LPA
third: ₹70LPA
no IIT. no MBA. just worked hard.
what about you?— Saurabh ✧ (@saurabhyadavz) August 3, 2025
ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ బ్రేక్
‘మీరు 7.7 శాతం వేతన పెంపుతో మొదటి ఉద్యోగం నుంచి రెండో ఉద్యోగానికి మారారు. అందులో ఎన్ని రోజులు వర్క్ చేశారు?’ అని ఒకరు పోస్ట్ చేశారు. దీనికి స్పందిస్తూ సౌరబ్..‘ఇది చాలా పెద్ద కథ. నాకు వచ్చిన ఆఫర్‌ను ఓకే చేయడం తప్పా.. నాకు వేరే మార్గం లేదు. నేను మొదటి ఉద్యోగానికి రాజీనామా చేశాను. తరువాత ఒక మోసపూరిత స్టార్టప్‌లో చేరాను. ఆపై అక్కడి నుంచి మరో కంపెనీలో చేరాను’ అని తెలిపారు.
You switched from first to second for 7.7% hike?
And for how much time did you work in the 2nd job?— Prapat Saxena (@PrapatnotPratap) August 3, 2025