
విశాఖపట్నం: దమ్ము శ్రీజ... ఈ పేరు ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి, తన దూకుడుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన ప్రతిభతో బిగ్‌బాస్‌లో కచ్చితంగా రాణిస్తుందని ఈ ప్రాంతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి బిగ్‌బాస్ వరకు..
శ్రీజ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నెలకు రెండు లక్షలకు పైగా జీతం సంపాదిస్తున్నప్పటికీ, తన ప్రతిభను నిరూపించుకోవడానికి బిగ్‌బాస్‌ను ఒక వేదికగా ఎంచుకున్నారు. ఆడిషన్స్ అనే అగ్నిపరీక్షలో నెగ్గి, ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.
తండ్రి నిజాయతీ, అంకితభావం
శ్రీజ తండ్రి తండ్రి దమ్ము శ్రీను, జీవీఎంసీ 92వ వార్డులో పారిశుధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు. వార్డులో ఏ సమస్య ఉన్నా, అది మురుగు కాల్వలైనా, చనిపోయిన వీధి కుక్కలైనా, వెంటనే అక్కడికి వెళ్లి పరిష్కరిస్తారు. ఒక సూపర్‌వైజర్‌గా కాకుండా, ఒక కార్మికుడిలా తన సిబ్బందితో కలిసి పనిచేసే గుణం ఆయనది. కొంతమంది దురభిమానం కారణంగా తోటి కార్మికుడు చేసిన దాడిలో ఒక కన్ను కోల్పోయారు.
శ్రీజకు మద్దతివ్వండి
తమ కుమార్తె శ్రీజకు మద్దతివ్వాలని శ్రీను దంపతులు కోరుతున్నారు. ప్రతీ ఎపిసోడ్‌లో ఆమె ఆట తీరును గమనించి, పూర్తి మద్దతు తెలిపి, ఓట్లు వేయాలని ప్రేక్షకులందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు.