సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కుచ్చుటోపి.. ఏకంగా 46 లక్షలు కాజేసిన కేటుగాళ్లు | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కుచ్చుటోపి.. భార్య నగలు అమ్మి, స్నేహితుల వద్ద అప్పుచేసి మరీ

Published Sun, Jul 9 2023 12:19 PM

Cyber Crime: Ameenpur Software Engineer Loses 46 lakhs - Sakshi

సాక్షి, సంగారెడ్డి: కమీషన్‌ పేరిట ఆశ చూపి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్లు టోకరా వేశారు. దీంతో భారీ నగదు పోగొట్టుకొన్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అమీపూర్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి జూన్‌ 28న పార్ట్‌ టైం జాబ్‌ అంటూ వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌కు స్పందించాడు. అందులో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. దీంతో సైట్‌ నిర్వాహకుడు అతడికి ఒక వాలెట్‌ ఐడీ ఇచ్చారు.

అందులో ఉద్యోగి ముందుగా రూ.2 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్‌లు చేస్తున్నాడు. కాగా తాను పెట్టిన నగదును సైబర్‌ నేరగాళ్లు తనకిచ్చిన వాలెటఖలె చూపిస్తున్నారు. ఈ క్రమంలో బాధితుడు తన భార్య నగలు అమ్మి, స్నేహితుల వద్ద అప్పు చేసి, జాబ్‌లోను ద్వారా మొత్తంగా 35 దఫాలుగా రూ.46 లక్షలు చెల్లించాడు. సైబర్‌ నేరగాళ్లు ఉద్యోగితో నగదు పెట్టిస్తూ తనకు ఇచ్చిన వాలెట్‌లో నగదుతోపాటు కమీషన్‌ నగదు చూపించారు. దీంతో ఉద్యోగి చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమిషన్‌ ఇవ్వాలని అడగగా స్పందించలేదు. దీంతో బాధితుడు తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది.
చదవండి: ఉద్యోగాల పేరుతో మోసం.. దుబాయ్ తీసుకెళ్లి షేక్‌లకు అమ్మేసిన బ్రోకర్‌

Advertisement
 
Advertisement