
చిన్నశంకరంపేట(మెదక్): అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వగ్రామానికి తరలివచ్చాడు. మెదక్ జిల్లా (Medak District) చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్ అమెరికాలో పదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా (Software Engineer) పనిచేస్తున్నారు. గతంలో 25 ఏళ్లు చిన్నశంకరంపేట సర్పంచ్‌గా పనిచేసిన తన తాత శంకరప్ప స్ఫూర్తితో.. త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని సంకల్పించారు.
దీంతో చంద్రశేఖర్ దంపతులు అమెరికా నుంచి బుధవారం చిన్నశంకరంపేట (Chinna Shankarampeta) చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు అనంత పద్మనాభస్వామి గుట్ట నుంచి సోమేశ్వరాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వారికి స్వాగతం పలికారు. అనంతరం చంద్రశేఖర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తాత స్ఫూర్తితో గ్రామానికి సేవ చేసేందుకు స్వగ్రామానికి వచ్చానని చంద్రశేఖర్ తెలిపారు.
చదవండి: లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు