
ప్రపంచ సాంకేతిక రంగం అసాధారణ వేగంతో విస్తరిస్తోంది. నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. అయితే దశాబ్దాలుగా.. అమెరికా భారతీయ సాంకేతిక నిపుణులకు ప్రధాన గమ్యస్థానంగా ఉండడంతో, మనవాళ్ల ఆలోచనలు అమెరికాను దాటి వెళ్లలేదు. అయితే, పెరుగుతున్న వీసా పరిమితులు మాత్రమే కాదు, అమెరికన్ నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయాల వల్ల కూడా గత కొంతకాలంగా చాలా మంది భారతీయ నిపుణులు కెరీర్ కోసం అమెరికాను దాటి ఇతర నగరాల వైపు చూడటం ప్రారంభించారు.
కొలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్స్ టాప్ టాలెంట్ లొకేషన్స్ 2025 నివేదిక ప్రకారం.. యూరప్, ఆసియా ఇతర ప్రాంతాలలోని అనేక నగరాలు తమను తాము ప్రపంచ ఐటీ కేంద్రాలుగా వేగంగా మలచుకుంటున్నాయి. ఈ గమ్యస్థానాలు కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో ప్రపంచ స్థాయి కెరీర్‌లకు వేదికలను అందించడమే కాకుండా, మెరుగైన జీవనశైలికి కూడా హామీ ఇస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ వెలుపల కెరీర్ అవకాశాలను అన్వేషిస్తున్న వారి కోసం కొలియర్స్ నివేదిక అందించిన 25 ఐటీ కేంద్రాల జాబితా ప్రకారం, అవి ఏవేవి అంటే..
లండన్ (యునైటెడ్ కింగ్‌డమ్)
బలమైన వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ అభివృద్ధి చెందుతున్న ఏఐ పర్యావరణ వ్యవస్థ మద్దతుతో లండన్ యూరప్ కి ఒక ప్రబల ఆర్థిక సాంకేతిక శక్తి కేంద్రంగా ఉండి ఐటీ కెరీర్‌లో అమెరికాకు ప్రత్యామ్నాయంగా మారింది.
బీజింగ్ (చైనా)
ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో బలమైన పట్టు ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రధాన ఆవిష్కరణ కేంద్రం.
బెంగళూరు (భారతదేశం)
తరచుగా భారతదేశ సిలికాన్ వ్యాలీ అని పిలువబడే బెంగళూరు, ఐటీ సేవలు, స్టార్టప్‌లు గ్లోబల్ ఆర్ అండ్ డి లో దేశాన్ని ముందుండి నడిపిస్తూనే ఉంది.
పారిస్ (ఫ్రాన్స్)
బహుళజాతి కంపెనీలు వినూత్న స్టార్టప్‌ల శక్తివంతమైన మిశ్రమంతో, పారిస్ సాంకేతిక ప్రతిభకు అగ్రగామిగా యూరోపియన్ కేంద్రంగా ఉంది.
డబ్లిన్ (ఐర్లాండ్)
బలమైన స్టార్టప్ వ్యవస్థ ప్రతిభ సమూహంతో యూరప్ సాంకేతిక రంగానికి చిరునామాగా డబ్లిన్ ఉద్భవించింది.
టోక్యో (జపాన్)
రోబోటిక్స్, ఆటోమేషన్ ఏఐ లకు ప్రసిద్ధి చెందిన టోక్యో ఆసియా ఖండపు హైటెక్ ఆవిష్కరణల రాజధానిగా ఎదుగుతోంది.
మ్యూనిచ్ (జర్మనీ)
అధునాతన ఇంజనీరింగ్, ఆటోమోటివ్ ఐటీ సాంకేతికత ఆధారిత పరిశ్రమలలో లోతైన పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది.
స్టాక్‌హోమ్ (స్వీడన్)
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు నిలయం, స్టాక్‌హోమ్ వ్యవస్థాపకత ఆవిష్కరణలకు కేరాఫ్‌గా వృద్ధి చెందుతోంది.
షాంఘై (చైనా)
ఈ-కామర్స్, ఫిన్‌టెక్ కృత్రిమ మేధస్సులలో సామర్ధ్యాలతో వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.
బెర్లిన్ (జర్మనీ)
డైనమిక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రసిద్ధి చెందిన బెర్లిన్, యువ ఆవిష్కర్తలకు ఒక సరికొత్త అయస్కాంతంగా మారింది.
సియోల్ (దక్షిణ కొరియా)
ఎలక్ట్రానిక్స్, 5జీ, ఏఐ స్వీకరణలో అగ్రగామిగా ఉన్న సియోల్, డిజిటల్ సరిహద్దులను విస్తరిస్తూ దూసుకుపోతోంది.
షెన్‌జెన్ (చైనా)
ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లో కీలకమైన నగరం, ప్రపంచ డిజిటల్ సేవల విస్తరణకు గణనీయంగా దోహదపడుతోంది.
టొరంటో (కెనడా)
ఏఐ పరిశోధన టెక్ స్టార్టప్‌లకు కేంద్రంగా ఉన్న టొరంటో పెట్టుబడి ప్రపంచ ప్రతిభ రెండింటినీ ఆకర్షిస్తుంది.
బుకారెస్ట్ (రొమేనియా)
విస్తరిస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో తూర్పు ఐరోపాలో ఐటీ అవుట్‌సోర్సింగ్‌కు నిఖార్సైన గమ్యస్థానం.
మాడ్రిడ్ (స్పెయిన్)
ఫిన్‌టెక్, టెలికాం డిజిటల్ సేవలలో బలమైన మాడ్రిడ్, యూరోపియన్ ఐటీ హబ్‌గా క్రమంగా దినదినాభివృద్ధి చెందుతోంది.
ఆమ్‌స్టర్ డామ్ (నెదర్లాండ్స్)
ఫిన్‌టెక్ క్లౌడ్ కంప్యూటింగ్ సామర్ధ్యానికి ప్రసిద్ధి చెందిన ఈ నగరం డిజిటల్ వాణిజ్యానికి కూడా ఒక కేంద్రం.
హైదరాబాద్ (ఇండియా)
అనేక ఆర్ అండ్ డి కేంద్రాలకు నిలయం, హైదరాబాద్ భారతదేశ ఐటీ విస్తరణకు మూలస్తంభంగా వేగంగా ఎదుగుతోంది.
పూణే (ఇండియా)
అభివద్ధి చెందుతున్న సాఫ్ట్‌వేర్ సేవల పరిశ్రమ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో, పూణే అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది.
హాంగ్‌జౌ (చైనా)
ఇ–కామర్స్ డిజిటల్ ఆవిష్కరణలలో ప్రముఖ నగరం, హాంగ్‌జౌ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను శిఖరాగ్రంలో నిలుపుతోంది.
ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ)
బ్యాంకింగ్ రంగానికి బలమైన సంబంధాలతో యూరప్ ఖండపు ఫిన్‌టెక్ సైబర్ సెక్యూరిటీ హబ్‌గా గుర్తింపు పొందింది.
మెక్సికో నగరం (మెక్సికో)
లాటిన్ అమెరికాలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, అవుట్‌సోర్సింగ్ హబ్, భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)
బ్లాక్‌చెయిన్, ఫిన్‌టెక్ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన జ్యూరిచ్ ఆవిష్కరణ స్థిరత్వం రెండింటినీ అందిస్తుంది.
వార్సా (పోలాండ్)
తూర్పు ఐరోపాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ సేవల కేంద్రం, యువ నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి మద్దతుతో విస్తరిస్తోంది.
గ్వాంగ్‌జౌ( చైనా)
ఆవిష్కరణలను తయారు చేయడం డిజిటల్ సేవలను విస్తరించడంపై దృష్టి సారించిన చైనా నగరం.
రోమ్ (ఇటలీ)
ఇయు సాంకేతిక కార్యక్రమాల బలమైన అండతో యూరప్‌లో డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న నగరం.