హైదరాబాద్: గర్భందాల్చలేదని, ఉద్యోగం చేయాలని భర్త, అత్త వేధింపులకు గురిచేయడంతో ఓ గృహిణి ఉరి వేసుకొని తనువు చాలించిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..జగిత్యాలకు చెందిన సౌజన్య(27)కు పెద్దపల్లికి చెందిన బోగ కిరణ్‌తో గత మార్చి 22న వివాహం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ భార్య సౌజన్యతో కలిసి టీఎన్‌జీఓస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కిరణ్ సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లాడు. భర్త సాయంత్రం 4 గంటలకు రాగా తలుపులు తెరువలేదు.
ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపు గడియ విరగ్గొట్టి చూడగా సౌజన్య ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని చనిపోయి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని స్వా«దీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఉద్యోగం చేయమని, గర్భం దాల్చలేదని భర్త, అత్త మల్లేశ్వరి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని సౌజన్య తల్లి రాజేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


