పెళ్లి చేసుకోవాలన్న యువకుడి ఒత్తిడితో విద్యార్థిని బలవన్మరణం
రంగారెడ్డి జిల్లా: తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువకుడు పెడుతున్న వేధింపులను భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన సిద్దగోని మహేశ్, ఇదే గ్రామానికి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థిని పూజ(17)ను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆమె తనకు దక్కుతుందో.. లేదోనని ఆందోళనకు గురైన మహేశ్ నెల రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చేరి్పంచగా, కోలుకుని ఇంటికి వచ్చాడు.
ఆ తర్వాత తరచూ పూజకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపోతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది తెలిసిన మహేశ్ యువతిపై మరింత ఒత్తిడి పెంచడంతో మనోవేదనకు గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు, ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. కాగా, మహేశ్ బెదిరింపులతోనే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళవారం ఉద యం పూజ మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐ, గ్రామస్తు లు నచ్చజెప్పడంతో శాంతించారు. మహేశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


